Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: యంగ్ డైరెక్టర్ వశిష్టతో చిరు 156 మూవీ.. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్లు టాక్..

యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని వంశీ, ప్రమోద్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సాయి మాధవ్ బుర్రా రచనలో ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోట కే.  నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. సుస్మిత కొణిదెల మెగా 156 లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించనున్నారు.

Megastar Chiranjeevi: యంగ్ డైరెక్టర్ వశిష్టతో చిరు 156 మూవీ.. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్లు టాక్..
Megastar Chinrajeevi 156 Movie
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2023 | 5:34 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 156 చిత్రం షూటింగ్ దసరా రోజున పూజాకార్యక్రమాన్ని జరుపుకుంది. చిరు హీరోగా సినిమా ప్రారంభమైందని విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కుర్ర హీరోలతో సమానంగా వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు తన 156వ సినిమాను యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు.  దసరా సందర్భంగా చిరు 156 వ సినిమా గ్రాండ్ గా పూజాకార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు మొదట క్లాప్ కొట్టారు.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని వంశీ, ప్రమోద్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సాయి మాధవ్ బుర్రా రచనలో ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోట కే.  నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. సుస్మిత కొణిదెల మెగా 156 లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో జరుపుకోనుందని  హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

చిత్ర నిర్మాణ బ్యానర్ యువి క్రియేషన్స్ పూజా కార్యక్రమాల వీడియో ఫుటేజీని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్-డ్రామా  సూపర్ హిట్ సినిమా బింబిసారతో ఒక్కసారిగా డైరెక్టర్ గా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు విశిష్ట. ఇపుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశాన్ని అందుకున్నాడు. సాయి మాధవ్ బుర్రా కలం నుంచి జాలువారిన కథతో ఈ సినిమా సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..