Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట ఘనంగా దసరా సంబరాలు.. సేవా స‌మాజ్‌లోని అమ్మాయిల‌తో బతుకమ్మని జరుపుకున్న కొణిదెల క్లింకారా..

రామ్ చరణ్ తన భార్య ఉపాసన కుటుంబం తరపున వచ్చే ఓ సంప్రదాయాన్ని అనుసరిస్తూ కూతురు తో కలిసి సకుటుంబ సపరివార సమేతంగా ఓ సంస్కృతిని ఆచ‌రించి కొన‌సాగించారు రామ్‌చ‌ర‌ణ్‌. బాలికా నిల‌యం సేవా స‌మాజ్‌లోని అమ్మాయిల‌తో క‌లిసి ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని ఘనంగా జ‌రుపుకున్నారు. ఉపాస‌న బామ్మ‌ ఈ సేవా సంస్థకు 30 ఏళ్లకు పైగా ఆసరాగా నిలిచారు.

Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట ఘనంగా దసరా సంబరాలు.. సేవా స‌మాజ్‌లోని అమ్మాయిల‌తో బతుకమ్మని జరుపుకున్న కొణిదెల క్లింకారా..
Mega Family Dasara Fest
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2023 | 9:05 PM

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసన దంపతులు పండగలు, పర్వదినాలను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడమే కాదు.. అనాథాశ్రమంలో కూడా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. హిందూ కుటుంబ వ్యవస్థపునాది ఎంత గొప్పదో తెలియజేసే విధంగా మెగా ఫ్యామిలీ సభ్యులు పండగలను కలిసి జరుపుకుంటారు.  అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా దసరా ఉత్సవాలను చరణ్ ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకారా తో కలిసి జరుపుకున్నారు. అయితే తాము పండగను సంస్కృతి, సంప్రదాయాలకు వారసులం మాత్రమే కాదు.. మా ముందు తరాలకు అందించే బాధ్యత తీసుకున్నాం అన్న  చందంగా అద్భుతంగా దసరా ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకున్నారు.

అయితే రామ్ చరణ్ తన భార్య ఉపాసన కుటుంబం తరపున వచ్చే ఓ సంప్రదాయాన్ని అనుసరిస్తూ కూతురు తో కలిసి సకుటుంబ సపరివార సమేతంగా ఓ సంస్కృతిని ఆచ‌రించి కొన‌సాగించారు రామ్‌చ‌ర‌ణ్‌. బాలికా నిల‌యం సేవా స‌మాజ్‌లోని అమ్మాయిల‌తో క‌లిసి ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని ఘనంగా జ‌రుపుకున్నారు. ఉపాస‌న బామ్మ‌ ఈ సేవా సంస్థకు 30 ఏళ్లకు పైగా ఆసరాగా నిలిచారు.

మెగా ఫ్యామిలీ ఇంట దసరా సంబరాలు

ఇవి కూడా చదవండి

ఇటీవల ఉపాసన బామ్మ మరణించారు.. ఆమె స్మృతిని గుర్తు చేసుకుంటూ తమ ఇంట్లో ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంపతులు బాలికా నిల‌యం సేవా స‌మాజ్ లోని అనాథ బాలిక‌ల‌తో క‌లిసి ఉత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి అత్యంత వైభవంగా చాటి చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి సురేఖ దంపతులతో పాటు అంజనాదేవి, సాయి ధరమ్ తేజ్ అందరూ కలిసి బాలికలతో సందడి చేశారు. బాల బాలికలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు తమ పండంటి పాపాయి క్లిన్ కారా కొణిదెల తో కలిసి మెగా స్టార్ చిరంజీవి సురేఖ , అంజనాదేవి తదితరులు ఈ వేడుకల్లో పాలొన్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..