AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: ది వ్యాక్సిన్ వార్ సినిమా పై స్పందించకుండా.. మళ్ళీ వార్తల్లో నిలిచిన అదా శర్మ.. రీజన్ ఏమిటంటే..

'ది వ్యాక్సిన్ వార్' 28 సెప్టెంబర్ 2023న విడుదలైంది. సినిమాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గురించి అదా శర్మను అడిగినప్పుడు .. ఆమె ఈ చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించకుండా ఉండటమే మంచిదని భావించినట్లు ఉంది.. అందుకే అదా మౌనంగా ఉండిపోయింది. తన మౌనానికి కారణాన్ని కూడా అదా శర్మ పంచుకుంది. ది వ్యాక్సిన్ వార్ గురించి అడిగినప్పుడు, అదా మాట్లాడుతూ.. కేరళ స్టోరీ సినిమా తర్వాత, తాను సినిమా  మొత్తం చూడకుండా ఏ సినిమా గురించి మాట్లాడకూడదని తాను తెలుసుకున్నానని చెప్పింది.

Adah Sharma: ది వ్యాక్సిన్ వార్ సినిమా పై స్పందించకుండా.. మళ్ళీ వార్తల్లో నిలిచిన అదా శర్మ.. రీజన్ ఏమిటంటే..
Ada Sharma
Surya Kala
|

Updated on: Oct 03, 2023 | 9:23 AM

Share

హీరోయిన్ అదా శర్మకు ‘కేరళ స్టోరీ’ మూవీ స్పెషల్ గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ  లైమ్‌లైట్‌లోకి వచ్చిన అదా శర్మ .. తాజాగా హెడ్‌లైన్స్‌ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి అదా శర్మ ఒక ప్రశ్నకు సంధానం చెప్పకుండా అని హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. వాస్తవానికి వివేక్ అగ్నిహోత్రి తాజా సినిమా  ‘ది వ్యాక్సిన్ వార్’ 28 సెప్టెంబర్ 2023న విడుదలైంది. సినిమాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గురించి అదా శర్మను అడిగినప్పుడు .. ఆమె ఈ చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించకుండా ఉండటమే మంచిదని భావించినట్లు ఉంది.. అందుకే అదా మౌనంగా ఉండిపోయింది. తన మౌనానికి కారణాన్ని కూడా అదా శర్మ పంచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vivek Ranjan Agnihotri (@vivekagnihotri)

కేరళ కథ తర్వాత నేను నేర్చుకున్నాను..

ది వ్యాక్సిన్ వార్ గురించి అడిగినప్పుడు, అదా మాట్లాడుతూ.. కేరళ స్టోరీ సినిమా తర్వాత, తాను సినిమా  మొత్తం చూడకుండా ఏ సినిమా గురించి మాట్లాడకూడదని తాను తెలుసుకున్నానని చెప్పింది. ‘ది కేరళ స్టోరీ’ విడుదల కంటే.. ముందు టీజర్‌ను విడుదల చేయడం తనకు ఇంకా గుర్తుంది. “కొన్ని సెకన్ల టీజర్ ను చూసి  చాలా మంది మొత్తం సినిమా ఇదే అంటూ ఆ సినిమా గురించి రకరకాల అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు.” సో తనకు అలా ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ గురించి చెప్పడం ఇష్టం లేదని.. సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ కారణంగా అదా శర్మ ది వ్యాక్సిన్ వార్  చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించకుండా తప్పించుకుంది.

అదా శర్మ ఫిల్మీ గ్రాఫ్

కేరళ స్టోరీకి ముందు అదా శర్మ కమాండో ఫిల్మ్ సిరీస్, హసీ తో ఫేసీ , 1920లో కనిపించింది. అయిదు అదా సినీ కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచేంది.. మొదటి బ్లాక్‌బస్టర్ 2023లో రిలీజ్ అయిన కేరళ స్టోరీనే. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా చాలా వివాదాల్లో నిలవడం ఒక కారణం. సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..