Akshay Kumar: చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్.. ఫోటో వైరల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సినిమా సెలబ్రెటీలు కూడా చీపురు పట్టుకొని శుభ్రం చేస్తూ కనిపించారు.  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే పని చేశారు. అక్షయ్ కుమార్ చీపురు చేతపట్టి బీచ్ ను శుభ్రం చేశారు. ఈ ఫోటోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Akshay Kumar: చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్.. ఫోటో వైరల్
Akshay Kumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2023 | 9:44 AM

గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛతా హి సేవ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సినిమా సెలబ్రెటీలు కూడా చీపురు పట్టుకొని శుభ్రం చేస్తూ కనిపించారు.  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే పని చేశారు. అక్షయ్ కుమార్ చీపురు చేతపట్టి బీచ్ ను శుభ్రం చేశారు. ఈ ఫోటోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

బీచ్ శుభ్రం చేస్తున్న ఫోటోను అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో అక్షయ్ తెల్లటి చొక్కా, నల్లని షార్ట్ ధరించి కనిపించాడు. చేతిలో చీపురుతో బీచ్‌ని శుభ్రం చేస్తూ కనిపించాడు. అక్షయ్ కుమార్ ఈ ఫోటోను షేర్ చేయడంతో పాటు సందేశం కూడా ఇచ్చారు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఇండియాలో లేరు. అయినప్పటికీ ఆయన స్వచ్ఛతా హి సేవలో పాల్గొన్నారు. ‘మీ పరిసరాలను, మనసును శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి’ అంటూ అక్షయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే..  ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రం ‘OMG 2’ 100 కోట్ల రూపాయల మార్కును దాటింది. ఈ సినిమాతో పాటు సన్నీ డియోల్ ‘గదర్ 2’ కూడా విడుదలైంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘హేరా ఫెయిరీ 3’, ‘బడే మియా ఛోటే మియా’, ‘మిషన్ రాణిగంజ్’, ‘సింగం ఎగైన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. ఏడాది ఐదు ఆరు సినిమాలను రిలీజ్ చేస్తూ బాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేశారు అక్షయ్.

అక్షయ్ కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..