Krishna Mukunda Murari Episode September 28th, 2023: కృష్ణకు ముకుంద సవాల్.. మా ప్రేమ మధ్యలోకి నువ్వు వచ్చావు..నిన్ను అందరూ అసహ్యించుకునేలా చేస్తా..

ఏసీపీ సార్ మనసులో ముకుంద లేదని నాకు తెలుసు.. ఇక ఆ విషయం ఆలోచించవద్దు.. ఇప్పుడు తెలుసుకోవలసింది. ఎసిపి సార్ మనసులో తాను ఉన్నానా లేనా అని తెలుసుకోవడం ముఖ్యం అని కృష్ణ అని అనుకుంటుంది. నిద్రపోతున్న మురారీని నిద్రలేపి మరీ  ఈరోజు సెలవు కదా.. ఇంకొంచెం సేపు నిద్రపోండి అని చెబుతుంది.

Krishna Mukunda Murari Episode September 28th, 2023: కృష్ణకు ముకుంద సవాల్.. మా ప్రేమ మధ్యలోకి నువ్వు వచ్చావు..నిన్ను అందరూ అసహ్యించుకునేలా చేస్తా..
Kirhsna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2023 | 7:36 AM

తన ప్రేమ గురించి భవానికి చెప్పడానికి.. భవానీ ఫోన్ లోని కన్నల్ ఫోన్ నెంబర్ దొంగిలించడానికి పక్క ప్లాన్ తో భవానీ గదిలోకి వస్తుంది ముకుంద. పెళ్ళైనప్పటి నుంచి ఆదర్శ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నా రాలేదు.. అని చెబుతుంటే మరోవైపు ఇదంతా వింటున్న ఆదర్శ్ ను వెతకవద్దు.. అంటూ తన ప్రేమ గురించి వాగుతుందా ఏమిటి అని ఆలోచిస్తుంది కృష్ణ. కానీ వస్తాడు అని కన్నల్ నాకు చెప్పాడు ముకుంద అని భవానీ చెబుతుంది. ఏసీపీ సార్ నా జీవితం అని చెప్పేస్తుందా ఏమిటి అని కృష్ణ కంగారు పడుతుంటే.. ముకుంద లెదత్తయ్య.. ఆదర్శ్ వచ్చినా గానీ.. అంటుంటే.. కృష్ణ పెద్దత్తయ్య అంటూ భవానీ గదిలోకి వస్తుంది. నువ్వేమిటి ఈ టైం లో అంటే..  ముకుందతో మాట్లాడదామని వెళ్తే.. తన గదిలో లేదు..మధు ఇక్కడికి వచ్చిందని చెబితే వచ్చాను అంటుంది.. భవానీ ముకుందకు ఆదర్శ్ తప్పనిసరిగా వస్తాడు నేను తీసుకొస్తా అని భరోసా ఇస్తుంది. ముకుందని కృష్ణ భవానీ రూమ్ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ముకుందని ఒంటరిగా బయటకు తీసుకుని వెళ్లి అడగాలని భవానీ నిర్ణయించుకుంటుంది.

కృష్ణకు ముకుంద సవాల్…

చూడు ముకుంద ఆదర్శ్ రాడని నీకు నమ్మకం లేదని చెబుతున్నావు నేను విన్నా.. నేను ఆదర్శ్ ని తేవాలనుకున్నాను తెస్తా.. మీరు ఆనందంగా ఉంటారు.. నేను ఏదనుకున్నా  నూటికి నూరుశాతం చేస్తాను.. ఎలాంటి టెన్షన్ లేకుండా నిద్రపో అని అంటే.. కృష్ణ నువ్వు అనుకున్నవన్నీ సాధించావా ఫెల్యూర్ లేదా .. కానీ ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతావు కృష్ణ అని ముకుంద చెబుతుంది. అంతేకాదు మురారీ నావాడు.. నా ప్రేమని గెలిపించుకుంటా ఏమి చేస్తావో చేసుకో అని సవాల్ విసురుతుంది కృష్ణకు.

ఒకరంటే ఒకరికి ప్రాణం..

చనిపోయిన ప్రేమ తిరిగి బతకదు అని కృష్ణ.. అంటే.. నా ప్రేమ ఎప్పటికి చనిపోదు.. అని అంటుంటే ఆదర్శ్ ని తీసుకుని వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు అని ముకుంద చెబుతూనే.. ప్రేమించుకున్న వాళ్లని ఎదురుగా పెట్టుకుని.. వస్తాడో రాడో తెలియని.. వ్యక్తి కోసం అంటూ నేను మురారీని ప్రేమిస్తున్నా.. ఒకరేంటీ ఒకరికి చాలా ఇష్టం.. ఒకరంటే చాలా ప్రాణం.. ఎదో చిన్న అవాంతరంరావడంతో ఇద్దరం వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నాం.. తప్పని సరి పరిస్థితిలో నిన్ను ఎలా మురారీ పెళ్లి చేసుకున్నాడో.. అలాగే నేను ఆదర్శ్ ను చేసుకున్నా అని ముకుంద ఓపెన్ కృష్ణ ముందు ఓపెన్ అయింది.

ఇవి కూడా చదవండి

ముకుందకు కృష్ణ షాక్

మా ప్రేమ మధ్యలోకి ఎక్కడో అడవిలో నుంచి నువ్వు వచ్చి మా ప్రేమకు అడ్డు వచ్చావు. మా మధ్య ప్రేమ చావలేదు. మా మధ్య ఎడబాటు కలిగించి మురారితో జీవితాన్ని ఎలా పంచుకుందామని ఎలా అనుకుంటున్నావు.. ఇవన్నీ తెలియక ఆదర్శ్ కోసం ఎలా వెళదామని అనుకుంటున్నావు  అని ముకుంద కృష్ణను నిలదీస్తుంది. అప్పుడు కృష్ణ తాపీగా ఈ విషయం నాకు తెలుసు ముకుంద అని అంటూ తెలిసే ఆదర్శ్ ను ఇక్కడకు తీసుకొస్తానని చెప్పా.. ఒక పెళ్ళైన మగాడిని కోరుకుంటుంది.. తెగించింది.. బరితెగించింది అని కృష్ణ అంటే.. ముకుంద కోపంతో షెటప్ అని అరుస్తుంది.

మురారీ కట్టిన తాళితోనే విలువ..

నీది పిచ్చి పెళ్లి నిన్న కాక మొన్న తత్థబుట్ట సర్దుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ వచ్చావు ఎప్పుడు తెగుతుందో తెలియని బంధాన్ని పట్టుకుని వేలాడుతుంది నువ్వు అని ముకుంద అంటుంటే.. తెంపితే తెగిపోయేది కాదు తాళి బంధం.. ఆ బంధం గురించి దాని విలువ గురించి నీకు ఏమి తెలుసు అని అని అంటే.. నేను ఇలాగె ఉంటాను.. దానికి విలువ లేదు .. దానికి విలువ మురారీ నా మేడలో తాళి కట్టినప్పుడు వస్తుంది అని ముకుంద చెబుతుంది. అది నేను ఉండగా జరగదు ముకుంద అని కృష్ణ అంటే.. జరుగుతుంది అని ముకుంద కృష్ణకు సవాల్ విసురుతుంది. వీళ్ళు నిన్ను అసహించుకోవడానికి ఒక్క సెకన్ చాలు.. ఆ ఒక్క సెకను కోసమే ఎదురుచూస్తున్నా అని ముకుంద అని అంటే..  అలాగే తపస్సు చెయ్యి ఒంటరిగా మిగిలిపోవడం తప్ప అని అంటుంది కృష్ణ.

ఏసీపీ సార్ మనసులో నువ్వు లేవు..

ఏసీపీ సార్ మనసులో నువ్వు లేని అని ముకుంద కు కృష్ణకు చెబితే.. నువ్వు ఉన్నావా అని కృష్ణని ముకుంద ప్రశ్నిస్తుంది. మురారీ మనసులో స్థానం ఉంది.. అది ఇప్పుడా ఒకప్పుడా అని అప్రస్తుతం.. అని అంటుంటే కృష్ణ తాళిని చూపిస్తుంది. అది తాయెత్తుకాదు వశపరుచుకోవడానికి.. అంటే మరి నీ మెడలో దానిని తెంపెయ్యి అని కృష్ణ ముకుందకి చెబుతుంది.  ఆ తాడు కట్టినవాడికి నీ మనసులో స్థానం లేకపోయినా ఆ తాళిని తెంపలేవు.. ఎందుకుంట అదే పెళ్లి.. ఎప్పటికైనా తాళికట్టినవాడితోనే జీవితం.. అది నాకు అయినా నీకు అయినా అని కృష్ణ చెబుతుంది.

మురారీ మనసులో కృష్ణ తన స్థానం గురించి

ఏసీపీ సార్ మనసులో ముకుంద లేదని నాకు తెలుసు.. ఇక ఆ విషయం ఆలోచించవద్దు.. ఇప్పుడు తెలుసుకోవలసింది. ఎసిపి సార్ మనసులో తాను ఉన్నానా లేనా అని తెలుసుకోవడం ముఖ్యం అని కృష్ణ అని అనుకుంటుంది. నిద్రపోతున్న మురారీని నిద్రలేపి మరీ  ఈరోజు సెలవు కదా.. ఇంకొంచెం సేపు నిద్రపోండి అని చెబుతుంది. కృష్ణ తల తుడిచి ఇలా చేసుకోవాలని చూపిస్తాడు మురారీ.. అప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించరా అని అడుగుతుంది కృష్ణ..

రేపటి ఎపిసోడ్ లో

కృష్ణ తో ముకుంద నీ కాపురం మూడు నాళ్ల ముచ్చట.. అనవసరంగా ఆశలు పెట్టుకోకు అని అంటే.. వెంటనే కృష్ణ పరాయి వాళ్ల భర్తని ఆశపడుతున్న నిన్ను ఏ పవిత్ర అనాలో అర్ధం కావడం లేదు అని షాకిస్తుంది నీకు ఉన్న మానసిక రోగం పోవాలంటే హ్యాపీగా ఆదర్శ్ కోసం ఎదురుచూడు అని అంటే.. అది ఎన్నటికీ జరగదు అని ముకుంద అంటుంది.. జరిగే తీరుతుంది అని కృష్ణ చెబుతుంది. జరిపించేది నేనే.. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ వేరబ్బా అంటుంది కృష్ణ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్