Hyderabad: గణపయ్య నిమజ్జనం సందర్భంగా మెట్రో టైమింగ్స్‌లో మార్పు.. మధ్య రాత్రి వరకు అందుబాటులోకి మెట్రో ట్రైన్స్..

మెట్రో కూడా భక్తుల సౌకర్యార్థం మధ్యరాత్రి వరకు తన సేవలను పొడిగించింది. సాధారణ రోజుల్లో అయితే 11 గంటలకే చివరి మెట్రో ఉంటుంది. కానీ భక్తుల రద్దీని సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం మధ్య రాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంచింది . మెట్రో టైమింగ్స్ పొడిగించడం వల్ల అక్యుపెన్సి పెరిగి మెట్రో కూడా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తుంది

Hyderabad: గణపయ్య నిమజ్జనం సందర్భంగా మెట్రో టైమింగ్స్‌లో మార్పు..  మధ్య రాత్రి వరకు అందుబాటులోకి మెట్రో ట్రైన్స్..
Ganesh Immersion
Follow us
Sravan Kumar B

| Edited By: Surya Kala

Updated on: Sep 28, 2023 | 6:42 AM

గణేష్ నవరాత్రుల సందర్భంగా మండపాల ఏర్పాట్లు నవరాత్రుల పూజలు నిమజ్జనోత్సవాలకు హైదరాబాదుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశంలో ముంబై తర్వాత ఆ స్థాయి ఇంకా చెప్పాలంటే అంతకుమించి మన హైదరాబాద్ లో ఉత్సవాలు జరుగుతాయి. ఎత్తయిన ఖైరతాబాద్ నాయకుడు బాలాపూర్ లడ్డు వేలం లాంటివిప్రత్యేక ఆకర్షణలు. మరోవైపు నవరాత్రుల పూజల తర్వాత నిమజ్జన ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. వేల విగ్రహాలను హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. వేల విగ్రహాలు పగలు రాత్రి తేడా లేకుండా నిమజ్జనం అవుతూనే ఉంటాయి. వేలల్లో పోలీసు బందోబస్తు.. లక్షల్లో వచ్చే భక్తులతో ఇసుకేస్తే రాలనంత గా జనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారిపోతాయి.

భారీ ఫ్లడ్ లైట్ ల నడుమ రాత్రిపూట కూడా నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని వేల విగ్రహాలను నిమజ్జనం చేసినా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చాలా స్పెషల్. అందులో ఈసారి పూర్తిగా మట్టితో తయారు చేసిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం చూసేందుకు లక్షల్లో భక్తులు ట్యాంక్ బండి వైపు వస్తుంటారు. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రెండు వేల బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్టుగా టిఎస్ఆర్టిసి ప్రకటన చేసింది.

ఇప్పుడు మెట్రో కూడా భక్తుల సౌకర్యార్థం మధ్యరాత్రి వరకు తన సేవలను పొడిగించింది. సాధారణ రోజుల్లో అయితే 11 గంటలకే చివరి మెట్రో ఉంటుంది. కానీ భక్తుల రద్దీని సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం మధ్య రాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంచింది . మెట్రో టైమింగ్స్ పొడిగించడం వల్ల అక్యుపెన్సి పెరిగి మెట్రో కూడా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తుంది. దీనిపై హైదరాబాద్ మెట్రో ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

గణేష్‌ నిమజ్జనం సందర్బంగా మెట్రో సమయాల్లో మార్పులు చేశారు. ప్రయాణీకులకు గురువారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో ట్రైన్ సేవలు అందుబాటులో ఉండనున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అలాగే మెట్రో సర్వీలసులను కూడా పెంచినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి ఒంటి గంటకు అన్ని స్టేషన్ల నుంచి చివరి సర్వీస్‌ బయలుదేరి అర్థరాత్రి 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకుంటాయని వెల్లడించారు. నిమజ్జనోత్సవాలకు హాజరవ్వాలనుకునే భక్తులు సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పై ఆధారపడితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది అని అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..