Hyderabad Rains: ఓ వైపు గంగమ్మ ఒడిలోకి గణపయ్యలు.. మరోవైపు 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిర్మల్, నల్గొండ, భువనగిరి, అదిలాబాద్, జనగాం జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ.

Hyderabad Rains: ఓ వైపు గంగమ్మ ఒడిలోకి గణపయ్యలు.. మరోవైపు 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
Hyderabad Rains
Follow us

|

Updated on: Sep 28, 2023 | 6:32 AM

భాగ్యనగరంలో జోరుగా నిమజ్జనం జరుగుతుంటే.. వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందనీ.. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిర్మల్, నల్గొండ, భువనగిరి, అదిలాబాద్, జనగాం జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. హైదరాబాద్‌లో నిన్న మధ్యాహ్నం దాకా ఎండ దంచికొట్టింది. సాయంత్రం 5 గంటలకు వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు.

ఇవి కూడా చదవండి

హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, చార్మినార్, బేగంబజార్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌లో జోరువాన జనాన్ని బేజారెత్తించింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ నిమజ్జనం కావడంతో మామూలుగానే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక వర్షం తోడైతే వాహనదారులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వర్షం వల్ల సమస్యలు తలెత్తితే, సహాయం కోసం డీఆర్ఎఫ్ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి