Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balapur Ganesh Laddu: రూ. 450 తో మొదలై.. 27 లక్షలకు చేరి.. ఇదీ బాలపూర్ గణేషుడి లడ్డూ చరిత్ర..

గణేశ్‌ నిమజ్జనం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే అందరి కళ్లు బాలాపూర్‌ గణేశ్‌ లడ్డు వేలం పైనే ఉన్నాయి. గత ఏడాది వేలంలో రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూను బాలాపూర్‌ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2021లో బాలాపూర్‌ లడ్డూ రూ. 18.90 లక్షలు పలుకగా.. 2022లో ధర 5.70 లక్షలు అధికంగా పలికింది. అయితే, బాలాపూర్ లడ్డూ వేలం పాట 2023లో ఏకంగా..

Balapur Ganesh Laddu: రూ. 450 తో మొదలై.. 27 లక్షలకు చేరి.. ఇదీ బాలపూర్ గణేషుడి లడ్డూ చరిత్ర..
Balapur Ganesh
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2023 | 11:11 AM

Balapur Ganesh Laddu 2023 Price: గణేశ్‌ నిమజ్జనం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎప్పటిలానే ఈసారి కూడా బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంలో మరోసారి రికార్డు ధర పలికింది. రూ. 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. గత ఏడాది వేలంలో రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూను బాలాపూర్‌ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2021లో బాలాపూర్‌ లడ్డూ రూ. 18.90 లక్షలు పలుకగా.. 2022లో ధర 5.70 లక్షలు అధికంగా పలికింది. అయితే, బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. 1994లో రూ. 450లతో మొదలయ్యింది ఈ లడ్డూ వేలం పాట. కరోనా సమయంలో తప్ప 28 ఏళ్ల పాటు ఈ వేలం పాట సాగింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ.. కొన్న వారి కొంగు బంగారంగా నిలుస్తోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది.

2015లో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..

వాస్తవానికి 1994 నుంచి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. కందాడ మాధవ రెడ్డి అనే వ్యక్తి పోటీపడి 2002లో రూ. 1.05 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2003లో లక్షన్నరకు పైగా పలికిల ధర ఆ తర్వాత సంవత్సరం నుంచి ధర పెరుగుతూ వస్తోంది. స్థానికుడు రఘునందనచారి 2007లో రూ. 4.15 లక్‌షలకు వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ. 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10.32 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

2016లో రూ. 14.65 లక్షలకు పెరిగింది బాలపూర్‌ లడ్డూ ధర. మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి 2016లో రూ. 14.65 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2018లో స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఆ తరువాత కొలను రాంరెడ్డి 2019లో రూ.17.60 లక్షలకు వేలం పాడి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి.. ఆ లడ్డూను సీఎంకు అందజేశారు.

2021లో రూ. 18.90 లక్షలు..

ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నాదర్గుల్‌కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 2021లో రూ. 18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. సాధారణంగా లడ్డూ వేలంపాటను నిర్వహించి వచ్చిన డబ్బును స్థానిక గణేష్‌ కమిటీ నిర్వహణలో.. మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇప్పటి వరకు రూ. 1,44,77,000 బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూకి వేలం పాటలో లభించింది. లడ్డూ వేలానికి ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్‌ లడ్డూ వేలం సొమ్ముతో.. ఇప్పటివరకూ గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు కూడా ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి, ఆ ప్రాంత అభివృద్దికి మరింత ఖర్చు చేస్తున్నారు.

ఏ సంవత్సరంలో ఎంత ధర పలికింది..

1. 1994 – కొలన్ మోహన్ రెడ్డి – రూ. 450.

2. 1995 – కొలన్ మోహన్ రెడ్డి – రూ. 4,500

3. 1996 – కొలన్ క్రిష్ణా రెడ్డి – రూ. 18,000

4. 1997 – కొలన్ క్రిష్ణా రెడ్డి – రూ. 28,000

5. 1998 – కొలన్ మోహన్ రెడ్డి – రూ. 51,000

6. 1999 – కళ్లెం అంజిరెడ్డి – రూ. 65,000

7. 2000 – కళ్లె ప్రతాప్ రెడ్డి – రూ. 66,000

8. 2001 – జి. రఘునందన్ చారి – రూ. 85,000

9. 2002 – కందాడ మాధవ రెడ్డి – రూ. 1,05,000

10. 2003 – చిగిరింత బాల్ రెడ్డి – రూ. 1,55,000

11. 2004 – కొలన్ మోహన్ రెడ్డి – రూ. 2,01,000

12. 2005 – ఇబ్రమ్ శేఖర్ – రూ. 2,08,000

13. 2006 – చిగిరింత తిరుపతి రెడ్డి – రూ. 3,00,000

14. 2007 – జి. రఘునందన్ చారి – రూ. 4,15,000

15. – 2008 కొలన్ మోహన్ రెడ్డి – రూ. 5,07,000

16. – 2009 సరిత – రూ. 5,10,000

17. – 2010 కొడాలి శ్రీధర్ బాబు – రూ. 5,35,000

18. – 2011 కొలన్ బ్రదర్స్ – రూ. 5,45,000

19. – 2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి – రూ. 7,50,000

20. – 2013 తీగల కృష్ణా రెడ్డి – రూ. 9,26,000

21. – 2014 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ. 9,50,000

22. – 2015 కళ్లెం మదన్‌మోహన్ రెడ్డి – రూ. 10,32,000

23. – 2016 కందాడి స్కైలాబ్ రెడ్డి – రూ. 14,65,000

24. – 2017 నాగం తిరుపతి రెడ్డి – రూ. 15,60,000

25. – 2018 తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా – రూ. 16,60,000

26. – 2019 కొలన్ రామ్ రెడ్డి – రూ. 17,60,000

27. – 2020 కరొనా కారణంగా వేలం రద్దు (సీఎం కేసీఆర్‌కు అందజేత)

28. – 2021 రమేష్ యాదవ్ – రూ. 18,90,000

29. – 2022 వంగేటి లక్ష్మారెడ్డి – రూ. 24,60,000

30. 2023  దాసరి దయానంద్‌ రెడ్డి – రూ. 27 లక్షలు

Balapur Ganesh Laddu

Balapur Ganesh Laddu

బాలాపూర్ గణేషుడి వద్ద సందడి..

బాలాపూర్ గణేషుడి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటలకు బాలాపూర్ గణేష్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటి సభ్యులు. ఊరు బొడ్రాయి వద్దకు వచ్చాక మరోసారి బాలాపూర్ గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. 9 గంటల సమయంలో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. గత సంవత్సరం రూ. 24.60 లక్షలు పలికి లడ్డూ ధర.. ఈసారి అంతకు మించి రూ. 27 లక్షలు పలికింది. బాలాపూర్ లడ్డును దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు సొంతం చేసుకున్నారు. లడ్డు వేలంను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

ఈసారి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పేరు..

మరికాసేపట్లో బాలపూర్ గణేషుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేషుడిని వాహనంపైకి ఎక్కించారు. బాలపూర్ గ్రామంలో ఊరేగించనున్నారు. 2, 3 గంటల వరకు గణేషుడి ఊరేగింపు కొనసాగనుంది. ఊరు బొడ్రాయి వద్దకు వచ్చాక ప్రత్యేక పూజలు చేసి వేలం పాట స్టార్ట్ చేస్తారు. మేళ తాళాలతో బాలాపూర్‌ గణేషుడిని ఊరేగిస్తున్నారు నిర్వాహకులు. గణేషుడిని చూసేందుకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు. అయితే, ఈ సారి లడ్డూ వచ్చిన వారి, తీసుకున్న వారి పేర్లను వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూను ‘హనీ ఫుడ్స్’ అందజేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..