బాలాపూర్ గణపతి లడ్డూకు రికార్డ్ ధర.. వేలంలో ఎన్ని లక్షలు పలికిందో తెలుసా..?
బాలాపూర్‌లో గణేష్ ఉత్సవ శోభ ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈసారి ఎంత రికార్డు ధరకు పలుకుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు గతేడాది వేలంలో రూ.24.60 లక్షలు బాలాపూర్ లడ్డూ పలికింది.
హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ ఊహించినట్లుగానే మరోసారి రికార్డు ధర పలికింది. ఏకంగా 27 లక్షల రూపాయలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ వినాయకుడి ధర రూ.24.60 లక్షలు పలికింది. గతంలో కన్నా… సుమారు 2లక్షల 40వేలు అధికంగా ధర పలికింది. వేలం పాటలో 36 మంది భక్తులు పాల్గొనగా.. బాలాపూర్ లడ్డూ వేలానికి నేటితో 30 ఏళ్లు
పూర్తవుతోంది.
Published on: Sep 28, 2023 07:24 AM
వైరల్ వీడియోలు
Latest Videos