Pakistan Army: వ్యవసాయం చేయనున్న పాక్ సైన్యం..! ప్రజల్లో భయందోళనలు..
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశాన్ని గట్టెక్కించేందుకు పాకిస్తాన్ సైన్యం వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టనుంది. నిక్కి ఆసియా అనే మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సైన్యం కౌలుకు తీసుకోబోతుంది. దీనిలో గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లను సాగు చేస్తుంది.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశాన్ని గట్టెక్కించేందుకు పాకిస్తాన్ సైన్యం వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టనుంది. నిక్కి ఆసియా అనే మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సైన్యం కౌలుకు తీసుకోబోతుంది. దీనిలో గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లను సాగు చేస్తుంది. వీటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్మును వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుంది. మిగిలిన సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సైన్యం చెప్తుంది. అయితే సైన్యం గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తుందనే విమర్శలు వస్తున్నాయి. దేశంలో దాదాపు 25 మిలియన్ల మంది ప్రజలు సొంత భూములు లేని నిరుపేదలుగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకటి కాదు రెండు కాదు పది లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..