AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Immersion: గణేష్ నిమజ్జనం వేళ.. నగరంలో ఈ రోజు ఉ. 6గం. నుంచి రేపు ఉ.10 గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపు

మహా నగరంలో మహా గణపతుల నిమజ్జనోత్సం కొనసాగుతుంది. నిమజ్జనం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు భాగ్యనగర పోలీసులు. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు.. ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని తెలిపారు.

Ganesh Immersion: గణేష్ నిమజ్జనం వేళ.. నగరంలో ఈ రోజు ఉ. 6గం. నుంచి రేపు ఉ.10 గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపు
Ganesh Immersion
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 28, 2023 | 7:40 AM

Share

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవం అంగరంగా వైభవంగా మొదలైంది.  ఏకదంతుడి శోభాయాత్రలకు విఘ్నాలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో గణేశుడి శోభాయాత్రలు సాగే రహదారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మల్లించారు. మహా నగరంలో మహా గణపతుల నిమజ్జనోత్సం కొనసాగుతుంది. నిమజ్జనం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు భాగ్యనగర పోలీసులు. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు.. ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్ఆర్ మీదుగా ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక పాతబస్తీలోని కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, మదీనా చౌరస్తా, సిటీ కాలేజి దగ్గర వాహనాల దారి మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరోవైపు చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్టల్ గంజ్, కోఠి ఆంధ్రాబ్యాంకు దగ్గర వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మధ్య మండలంలో చాపెల్ రోడ్డు ప్రారంభం నుంచి జీపీవో గద్వాల్ సెంటర్ మీదుగా ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ కూడలి, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరాపార్క్ జంక్షన్ వద్ద వాహనాల మళ్లిస్తున్నారు.

అటు పశ్చిమ మండలం పరిధిలో టోప్ ఖానా మసీదు దగ్గర నుంచి ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీదుగా ఏఆర్ పెట్రోల్ పంపు దగ్గర ట్రాపిక్ మళ్లిస్తున్నారు. ఉత్తర మండలం పరిధిలో నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌ పైకి ట్రాఫిక్ ను అనుమతించడం లేదు. సికింద్రాబాద్ సీటీవో మీదుగా ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద ట్రాపిక్ మళ్లిస్తున్నారు.

ఎన్టీఆర్ మార్గ్ లో వినాయకుడిని నిమజ్జనం చేసిన నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పైన నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. ఇక ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనోత్సవం తిలకించేందుకు వచ్చే ప్రజల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక కేంద్రాలు సిద్ధం చేశారు. సాగర్ చుట్టూ ఉండే ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల్లోనే తమ వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు.

ఆర్టీసీ బస్సులకు సైతం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హుస్సేన్ సాగర్‌కు కొద్ది దూరంలోనే సిటీ బస్సులను నిలిపివేస్తున్నారు. మెహిదీపట్నం బస్సులను..  మాసాబ్ ట్యాంక్, కూకట్ పల్లి బస్సులు ఖైరతాబాద్ చౌరస్తా, సికింద్రాబాద్ బస్సులు సీటీవో, ప్లాజా, ఎస్ బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఉప్పల్ బస్సులు రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్ సుఖ్ నగర్ బస్సులు గడ్డి అన్నారం, చాదర్ ఘాట్, రాజేంద్రనగర్ బస్సులు దానమ్మ హాట్స్, మిధాని బస్సులు ఐఎస్ సదన్, అంతర్ నగర బస్సులు నారాయణ గూడ వైఎంసీఏ వద్ద నిలిపివేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..