- Telugu News Photo Gallery Cinema photos Parineeti Chopra And Raghav Chadha Pre Wedding Rituals Playing Cricket And Indore Games See Photos
Parineeti Chopra: పరిణీతి చోప్రా vs రాఘవ్ చద్దా .. ఫ్యామిలీ ప్రీమియర్ లీగ్‌లో ఎవరు గెలిచారో తెలుసా?
లీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. తమ పెళ్లి ఫొటోలను ఒక్కొక్కటి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది పరిణీతి చోప్రా.
Updated on: Oct 03, 2023 | 8:00 AM

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. తమ పెళ్లి ఫొటోలను ఒక్కొక్కటి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది పరిణీతి చోప్రా.

తాజాగా తన వివాహానికి సంబంధించిన అందమైన వీడియోను పంచుకుంది పరిణీతి. అలాగే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పరిణీతి- చద్దా మాత్రమే కాకుండా ఇరు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. వధూవరులు ఇద్దరు ప్రీవెడ్డింగ్ షూట్ టీషర్ట్స్‌ను ధరించారు.

ఈ సందర్భంగా పరిణీతి చోప్రా టీమ్ ఆరెంజ్ కలర్ టీ-షర్ట్, డెనిమ్ జీన్స్‌లో కనిపించగా.. . రాఘవ్ చద్దా బ్లూ కలర్ టీ షర్ట్- జీన్స్‌లోనే దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన కుటుంబ సభ్యులు మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ రేసు, క్రికెట్ ఇలా.. ఎన్నో రకాల ఆటలు ఆడారు.

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఈ వీడియోలో మెరవడం విశేషం. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.

పరిణీతి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా ఈ వివాహానికి రాలేదు. అయితే ఆమె తల్లి మధు చోప్రా మాత్రం ఈ పెళ్లి వేడుకలకు హాజరైంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్‌లోనూ హుషారుగా పాల్గొన్నారు.





























