- Telugu News Photo Gallery Cinema photos Rowdy Hero Vijay Deverakonda next movie updates in Tollywood Telugu Heroes Photos
Vijay Deverakonda: సీక్వెల్ బాట లో విజయ్ దేవరకొండ.. గీత గోవిందం-2 పై అప్డేట్..
ఈ రోజుల్లో ఓ సినిమా కథను రెండున్నర గంటల్లో చెప్పలేకపోతున్నారు దర్శకులు. అందుకే మాట్లాడితే సీక్వెల్స్ అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా చేరినట్లు తెలుస్తుంది.ఈయన చేస్తున్న సినిమాల్లో ఒకటి 2 పార్ట్స్‌గా రానుంది. మరి ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా అడరజన్ సినిమాలు కమిటయ్యారు రౌడీ హీరో.
Updated on: Nov 16, 2023 | 5:24 PM

ఈ రోజుల్లో ఓ సినిమా కథను రెండున్నర గంటల్లో చెప్పలేకపోతున్నారు దర్శకులు. అందుకే మాట్లాడితే సీక్వెల్స్ అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా చేరినట్లు తెలుస్తుంది.

ఈయన చేస్తున్న సినిమాల్లో ఒకటి 2 పార్ట్స్‌గా రానుంది. మరి ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా అడరజన్ సినిమాలు కమిటయ్యారు రౌడీ హీరో.

అందులో పరశురామ్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సంక్రాంతి టార్గెట్ ఉంది కాబట్టి పరశురామ్ సినిమాను త్వరగా పూర్తి చేస్తున్నారు విజయ్. దాంతో పాటు గౌతమ్ సినిమాకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు విజయ్.

పాన్ ఇండియా సినిమాగా గౌతమ్ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముందు శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నా.. ఆమె డేట్స్ కుదరకపోవడంతో రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమా తర్వాత పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు గౌతమ్.

పోలీస్ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్‌గా హీరో ఎదిగే క్రమాన్ని చూపించబోతున్నారు గౌతమ్. విజయ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. కథ భారీగా ఉండటంతో ఒక భాగంలో చెప్పడానికి కుదరట్లేదని..

అందుకే పార్ట్ 2 చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పైగా ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ బాగా కలిసొస్తుంది. అందుకే VD12 కి ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నారు మేకర్స్. 2024లోనే ఈ సినిమా విడుదల కానుంది. అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నారు.





























