- Telugu News Photo Gallery Cinema photos Salman Khan dance in Mumbai local Train videos and photos goes viral in social media Telugu Viral Photos
Salman Khan: ముంబై లోకల్ ట్రైన్లో సల్లూ భాయ్ సందడి..? నెట్టింట హల్ చల్..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సల్లూ భాయ్ లోకల్ ట్రైన్‌లో ప్రయాణించడమే కాదు..అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేశాడు..బాలీవుడ్ పాపులర్ సాంగ్స్కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు సల్మాన్‌ఖాన్. తన డ్యాన్స్ మూమెంట్స్ తో సల్మాన్.. అభిమానులను ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది.
Updated on: Oct 02, 2023 | 8:21 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

సల్లూ భాయ్ లోకల్ ట్రైన్‌లో ప్రయాణించడమే కాదు..అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేశాడు..బాలీవుడ్ పాపులర్ సాంగ్స్కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు సల్మాన్‌ఖాన్.

తన డ్యాన్స్ మూమెంట్స్ తో సల్మాన్.. అభిమానులను ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది.ఇక వీడియోను చూసిన నెటిజన్లు, సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు.

నిజంగానే సల్మాన్‌ఖాన్ ముంబై లోకల్ ట్రైన్ ఎక్కాడా..? పైగా లోకల్ ట్రైన్‌లో సల్మాన్‌ఖాన్ డ్యాన్స్ చేశాడా..? ఇదంతా నిజమేనా అంటూ అభిమానులు తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందే మీరే చూడండి..

ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే..లోకల్ ట్రైన్ లో డ్యాన్స్ చేసింది నిజమైన సల్మాన్ ఖాన్ కాదు..డూప్. అవును.. అచ్చం సల్మాన్ ను పోలిన ఓ వ్యక్తి.. ముంబై లోకల్ ట్రైన్ లో హల్ చల్ చేశాడు. అచ్చం సల్మాన్ ఖాన్ లాగే హావభావాలు పలికించాడు.

డ్యాన్సు సైతం సల్మాన్ ఖాన్ లాగే చేయడంతో..అభిమానులు కొద్దిసేపు గుర్తు పట్టలేకపోయారు. నిజంగానే సల్మాన్‌ఖాన్ వచ్చి తమ ముందు డ్యాన్స్ చేస్తున్నాడా అని సందేహపడ్డారు చాలా మంది.
