- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD and Ganapath are like saga movies with same plot
Movie News: కల్కి 2898 ఏడి, గణపథ్ ఒకే కథాంశంతో సాగే సినిమాలా.. టీజర్స్ లో కామన్ పాయింట్స్ ఇవే..
ఒక్కోసారి ఒకే కథలను ఇద్దరు దర్శకులు తమకు తెలియకుండానే తెరకెక్కిస్తుంటారు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. తాజాగా మరోసారి అలాంటి సీన్ రిపీట్ కాబోతుందా..? రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకే కథతో వస్తున్నాయా..? 500 కోట్ల ప్రాజెక్ట్ ఓ వైపు.. 200 కోట్ల సినిమా మరోవైపు.. రెండూ సేమ్ స్టోరీస్‌తో వస్తున్నాయా..? ఇంతకీ ఏంటా సినిమాలు చూసేద్దామా..? ఈ రోజుల్లో కొత్త కథలు తీయడం కష్టమే. ఉన్న కథలనే ఎంత కొత్తగా తీసాం అనేది ఇంపార్టెంట్. దర్శకులు ఇదే చేస్తున్నారిప్పుడు. అయితే అందులోనూ కొన్నిసార్లు తెలియకుండానే సేమ్ ఐడియాతో రెండు సినిమాలు వస్తుంటాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Ram Naramaneni
Updated on: Oct 02, 2023 | 1:54 PM

ఒక్కోసారి ఒకే కథలను ఇద్దరు దర్శకులు తమకు తెలియకుండానే తెరకెక్కిస్తుంటారు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. తాజాగా మరోసారి అలాంటి సీన్ రిపీట్ కాబోతుందా..? రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకే కథతో వస్తున్నాయా..? 500 కోట్ల ప్రాజెక్ట్ ఓ వైపు.. 200 కోట్ల సినిమా మరోవైపు.. రెండూ సేమ్ స్టోరీస్‌తో వస్తున్నాయా..? ఇంతకీ ఏంటా సినిమాలు చూసేద్దామా..?

ఈ రోజుల్లో కొత్త కథలు తీయడం కష్టమే. ఉన్న కథలనే ఎంత కొత్తగా తీసాం అనేది ఇంపార్టెంట్. దర్శకులు ఇదే చేస్తున్నారిప్పుడు. అయితే అందులోనూ కొన్నిసార్లు తెలియకుండానే సేమ్ ఐడియాతో రెండు సినిమాలు వస్తుంటాయి. అప్పట్లో పటాస్, టెంపర్‌తో పాటు గతేడాది అంటే సుందరానికి, కృష్ణ వృందా విహారీ లాంటి సినిమాలు అలాగే వచ్చాయి.

.తాజాగా మరో రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఇలాగే వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. అవేవో కాదు.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ, టైగర్ ష్రాఫ్ గణపథ్ సినిమాలు. తాజాగా గణపథ్ టీజర్ చూసాక.. అదేంటి కల్కిలా ఉందనే టాక్ వచ్చింది. ఈ రెండింటి బ్యాక్ డ్రాప్ ఫ్యూచరే. 2070 ఏడీ నేపథ్యంలో గణపథ్ కథ సాగితే.. 2898 ఏడితో కల్కి వస్తుంది. అంధకారంలో ఉన్న ప్రజల్ని వెలుగు వైపు నడిపించే ధీరుల కథలే ఈ రెండు సినిమాలు.

భవిష్యత్‌లో తిండి దొరకని పరిస్థితుల్లో ఆహారం కోసం కొట్టుకునే మనుషులు ఉండటాన్ని చూపించారు టీజర్. ప్రభాస్ కల్కిలోనూ మనుషులను బానిసలను చేసినపుడు హీరో ఏం చేసారనేది చూపించారు.

ప్రపంచాన్ని కమ్మేసిన చెడుపై యుద్ధం చేసే వీరుడి కథే కల్కి. గణపథ్‌లోనూ ఇదే కనిపిస్తుంది. ప్రభాస్‌కు దీపిక తోడుంటే.. టైగర్‌కు కృతి తోడైంది. ఈ రెండింట్లోనూ గాడ్ ఫాదర్‌లా అమితాబ్ నటిస్తున్నారు. అక్టోబర్ 20న గణపథ్ విడుదల కానుంది.





























