- Telugu News Photo Gallery Cinema photos Trisha Krishnan remuneration is top in South Full details Telugu Actress Photos
Trisha Krishnan: త్రిష రెమ్యునరేషన్ సౌత్‌లోనే టాప్.. ఎంతో తెలుసా..?
తమిళ నటి త్రిష గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైందీ ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ.. కొన్నాళ్లపాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఇక 40 ఏళ్ల ఏజ్‌లో కూడా అందంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ వావ్ అనిపిస్తోందీ బ్యూటీ. తమిళ పొన్ను త్రిష.. వర్షం సినిమాతో మరింత పాపులర్ అయ్యింది.
Updated on: Oct 02, 2023 | 2:26 PM

తమిళ నటి త్రిష గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైందీ ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ.. కొన్నాళ్లపాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించింది.

ఇక 40 ఏళ్ల ఏజ్‌లో కూడా అందంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ వావ్ అనిపిస్తోందీ బ్యూటీ. తమిళ పొన్ను త్రిష.. వర్షం సినిమాతో మరింత పాపులర్ అయ్యింది.. ఈ చెన్నై అందం.. కొన్నాళ్లు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది.

అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగింది. త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా మరోసారి పలకరించింది. ఇక త్రిష రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..

సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి త్రిష అని టాక్. 40 ఏళ్లు దాటినా.. తన అందచందాలతో అదరగొడుతోన్న ఈ భామ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తోన్న చిత్రానికి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నయనతార రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె జవాన్ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. ఇక అనుష్క శెట్టి మూడో స్థానంలో ఉంది. ఆమె 6 కోట్ల వరకు తీసుకుంటోందట. ఇదిలావుంటే ఈ తమిళ పొన్ను త్వరలో ఓ మలయాళ కుర్ర నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని తమిళ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

దీనికి సంబంధించి త్వరలో ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట. అయితే నిజానికి కొన్నాళ్ల క్రితమే త్రిష పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. అందులో భాగంగా తమిళ వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏమైందో ఏమో.. ఆ పెళ్లి క్యాన్సల్ అయ్యింది.





























