- Telugu News Photo Gallery Cinema photos Bhagavanth kesari and leo going to be tough fight in october
Tollywood News: అక్టోబర్ 19 “టెన్షన్” నువ్వా నేనా అంటున్న స్టార్ హీరోలు
అక్టోబర్ 19న నువ్వా నేనా అన్నట్టుంది పరిస్థితి. అయితే ఈ సారి పోటీ హీరోల మధ్యకన్నా, కెప్టెన్ల మధ్య కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఆల్రెడీ ప్యాన్ ఇండియాకి రీచ్ అయిన లోకేష్ కనగరాజ్, అదే పనిలో ఉన్న అనిల్ రావిపూడి బరిలో తలపడుతున్నారు. ఈ సారి సిల్వర్ స్క్రీన్స్ మీద స్టామినా చూపించేదెవరు? చూసేద్దాం... నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైమ్ తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతున్న సినిమా భగవంత్ కేసరి. ఆయన బిడ్డగా శ్రీలీల కనిపిస్తున్నారు. జోడీగా కాజల్ నటిస్తున్నారు. హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇంతకు ముందు చాలా సార్లే చేశారు బాలయ్య.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 02, 2023 | 8:59 PM

అక్టోబర్ 19న నువ్వా నేనా అన్నట్టుంది పరిస్థితి. అయితే ఈ సారి పోటీ హీరోల మధ్యకన్నా, కెప్టెన్ల మధ్య కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఆల్రెడీ ప్యాన్ ఇండియాకి రీచ్ అయిన లోకేష్ కనగరాజ్, అదే పనిలో ఉన్న అనిల్ రావిపూడి బరిలో తలపడుతున్నారు. ఈ సారి సిల్వర్ స్క్రీన్స్ మీద స్టామినా చూపించేదెవరు? చూసేద్దాం...

నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైమ్ తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతున్న సినిమా భగవంత్ కేసరి. ఆయన బిడ్డగా శ్రీలీల కనిపిస్తున్నారు. జోడీగా కాజల్ నటిస్తున్నారు. హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇంతకు ముందు చాలా సార్లే చేశారు బాలయ్య. అయితే ఈ సారి భగవంత్ కేసరిలో అంతకు మించి ఉంటుందని హింట్ ఇస్తున్నారు అనిల్ రావిపూడి.

మీరు ఎంతైనా ఊహించుకోండి... అంతకు మించే ఉంటుంది సినిమా అంటున్నారు కెప్టెన్. బాలయ్య - కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలు, బాలయ్య,శ్రీలల మధ్య వచ్చే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ ఎపిసోడ్స్, అన్నిటినీ మించి మూవీలో ఉన్న మెసేజ్... కలగలిపి థియేటర్లలో ఆడియన్స్ తో ఈలలు కొట్టిస్తాయన్నది కెప్టెన్ నమ్మకం.

భగవంత్ కేసరి రిలీజ్ అవుతున్న సేమ్ డే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది లియో. బ్లడీ స్వీట్ అంటూ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ చేశారు కెప్టెన్ లోకేష్. విక్రమ్ రిలీజ్ అయిన తర్వాత లోకేష్ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఇంకో రేంజ్‌లో ఉన్నాయి. వాటన్నిటికీ లియో సమాధానం చెబుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది డైరక్టర్‌లో.

లియో ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. కశ్మీర్‌లో కీ పోర్షన్ షూట్ చేశారు. విజయ్ పక్కన త్రిష హీరోయిన్‌గా నటించారు ఈ మూవీలో. నెవర్ బిఫోర్ అన్నట్టు ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్నది యూనిట్ నుంచి అందుతున్న లీక్. ప్రస్తుతం ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న లియో మీద తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంట్రస్ట్ కనిపిస్తోంది.





























