- Telugu News Entertainment Tollywood Meenakshi Chaudhary has been chosen as the heroine in Thalapathy Vijay's movie
Meenakshi Chaudhary: బంపర్ ఆఫర్ అందుకున్న మీనాక్షి.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తుంది. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఈ మూవీలో తన గ్లామర్ తో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ.
Updated on: Oct 03, 2023 | 12:29 PM

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తుంది. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఈ మూవీలో తన గ్లామర్ తో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ.

ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకొని హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ అందుకుంది మీనాక్షి.

ఏకంగా దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న మీనాక్షి. విజయ్ 68 సినిమాలో మీనాక్షిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.




