Thalaivar 170 : సూపర్ స్టార్ రజినీకాంత్ 170 సినిమాలో ఆ టాలీవుడ్ హీరో..

ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్ సినిమాతో టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యారు లోకేష్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దళపతి విజయ్ తో కలిసి లియో అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు గతంలో వచ్చిన లోకేష్ సినిమాలు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని తెలుస్తోంది.

Thalaivar 170 : సూపర్ స్టార్ రజినీకాంత్ 170 సినిమాలో ఆ టాలీవుడ్ హీరో..
Rajinikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2023 | 11:55 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 700కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ తన 170 సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్ సినిమాతో టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యారు లోకేష్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దళపతి విజయ్ తో కలిసి లియో అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు గతంలో వచ్చిన లోకేష్ సినిమాలు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి ఒకొక్క అప్డేట్ బయటకు వస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ రితిక సింగ్ నటిస్తుందని అనౌన్స్ చేశారు. తెలుగులో వెంకటేష్ నటించిన గురు సినిమాతో పరిచయం అయ్యింది రితికా.. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ 170 సినిమాలో నటిస్తుంది .

అలాగే ఈ సినిమా టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. తాజా రానాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మరి ఈ సినిమాలో రానా విలన్ గా నటిస్తున్నాడా..? లేక మరేదైనా పాత్రలో కనిపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ నటులు నటించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ఇతర కీలక అప్డేట్స్ ను ఇవ్వనున్నారు మేకర్స్.  మరి ఈ సినిమాను లోకేష్ కానగరాజ్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.