Bigg Boss 7 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. విశ్వరూపం చూపించిన శివాజీ

హౌస్ లో ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరలో కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక హౌస్ లో ఈ వారం నామినేషన్ చాలా హాట్ హాట్ గా సాగాయి. సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్ లో శివాజీ మీద అందరు కసి తీర్చుకున్నారు. అతితెలివితో శివాజీ తన పవర్ అస్త్రను పోగొట్టుకున్నాడు. హౌస్ లో కొంతమందికి మాత్రమే ఫెవర్ గా ఉంటున్నాడని మెజారిటీ మెంబర్స్ చెప్పడంతో అతడి దగ్గర నుంచి పవర్ అస్త్రను లాగేసుకున్నారు బిగ్ బాస్.

Bigg Boss 7 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. విశ్వరూపం చూపించిన శివాజీ
Bigg Boss
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 03, 2023 | 3:38 PM

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.. ముందు నుంచే ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుందని చెప్తూ వస్తున్నారు అన్నట్టుగానే ఇప్పటికే సీజన్ 7లో చాలా జరిగాయి. ఇక హౌస్ లో ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరలో కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక హౌస్ లో ఈ వారం నామినేషన్ చాలా హాట్ హాట్ గా సాగాయి. సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్ లో శివాజీ మీద అందరు కసి తీర్చుకున్నారు. అతితెలివితో శివాజీ తన పవర్ అస్త్రను పోగొట్టుకున్నాడు. హౌస్ లో కొంతమందికి మాత్రమే ఫెవర్ గా ఉంటున్నాడని మెజారిటీ మెంబర్స్ చెప్పడంతో అతడి దగ్గర నుంచి పవర్ అస్త్రను లాగేసుకున్నారు బిగ్ బాస్. దాంతో అతడు మళ్లీ కంటెస్టెంట్ గా గేమ్ ఆడాల్సి వచ్చింది. దాంతో శివాజీని నామినేట్ చేస్తూ చాలా మంది తమ రీజన్స్ చెప్పారు. అయితే శివాజీ ఎప్పటిలానే పాడిన పాటే పాడాడు. హౌస్ నుంచి వెళ్ళిపోతా.. నన్ను పంపించేయండి అంటూ రాగాలు తీసాడు.

ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ముందుగా డాక్టర్ బాబు గౌతమ్ లాయర్ పాప శుభశ్రీ తో పులిహోర కలపడం.. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనిపించేలా ఓ లవ్ ట్రాక్ చూపించారు. ఆతర్వాత హౌస్ లో పవర్ అస్త్ర గెలుచుకున్న వాళ్లు తిరిగి ఆ పవర్ అస్త్రలను బిగ్ బాస్ కు ఇచ్చేయాలని సూచించాడు.

దాంతో సందీప్, శోభా, ప్రశాంత్ తమ పవర్ అస్త్రాలను తిరిగి ఓ బాక్స్ లో పెట్టేసి బిగ్ బాస్ కు అప్పజెప్పారు. దాంతో శివాజీ లోపల ఉన్నమరో కోణం బయటకు వచింది. దాంతో అతడు ఏయ్ ఏయ్ రో అంటూ పాటలు పాడాడు. వెటకారంగా నవ్వుతు తనలోని మరో కోణాన్ని చూపించాడు. దాంతో శోభాకు కోపం వచ్చింది. కొంతమంది ఉంటారు. తమకు రాకపోయినా పర్లేదు పక్కవాడికి రాకూడదని సంతోషపడతారు ఛీ .. అంటూ శివాజీని ఉద్దేశించి కామెంట్స్ చేసింది. ఇదంతా చూస్తుంటే నేటి ఎపిసోడ్ మరింత క్రేజీ గా ఉండనుందని అర్ధమవుతుంది.

బిగ్ బాస్ సీజన్ 7 ఇన్ స్టార్ గ్రామ్ పోస్ట్

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో