AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon: టాలీవుడ్ స్టార్ హీరోతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రవీనా టాండన్ కూతురు..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన 'కెజిఎఫ్ 2'లో రమిక సేన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆమె కూతురు రాషా థడానీ కూడా చిత్ర పరిశ్రమలో మెరవడానికి సిద్ధమైనట్లు సమాచారం. రవీనా కూతురు రాషా ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉంది. ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని బీ టౌన్ లోవార్తలు వినిపిస్తున్నాయి

Raveena Tandon: టాలీవుడ్ స్టార్ హీరోతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రవీనా టాండన్ కూతురు..!
Raveena Tandon
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2023 | 11:12 AM

Share

రవీనా టాండన్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది ఈ బ్యూటీ. సౌత్ లోనూ పలు సినిమాల్లో నటించింది. ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన ‘కెజిఎఫ్ 2’లో రమిక సేన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆమె కూతురు రాషా థడానీ కూడా చిత్ర పరిశ్రమలో మెరవడానికి సిద్ధమైనట్లు సమాచారం. రవీనా కూతురు రాషా ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉంది. ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని బీ టౌన్ లోవార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాషా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఈ బ్యూటీ రకరకాల ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్  సినిమాలో రాషా నటించబోతోందట. రాషా వయసు ఇప్పుడు 18 ఏళ్లు. ఆమె చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుందా లేక మరేదైనా పాత్రలో కనిపిస్తుందా అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకూ ఆమె ఏ సినిమాలో నటిస్తుందో తెలుసా.? రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గేమ్ చెంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘ఉప్పెన’ సినిమా తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ కోసం కొత్త కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా రాషాను ఎంపిక చేశారట బుచ్చిబాబు. అయితే తన మొదటి సినిమా హీరోయిన్  కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాలో నటించినప్పుడు ఆమెకు 17 ఏళ్లు. కానీ బుచ్చిబాబు తన పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు రాషా కోసం ఓ మంచి క‌థ‌ను సిద్ధం చేశాడు అని అంటున్నారు. దీనిపై  త్వరలోనే క్లారిటీ రానుంది.

గతంలో రవీనా టాండన్ మాట్లాడుతూ.. తన కూతురు సినిమా అరంగేట్రం గురించి హింట్ ఇచ్చింది. రాషా తన చదువును పూర్తి చేయాలి. ఆతర్వాత తాను సినిమాల్లోకి వస్తుంది. రాషా సినిమా ఇండస్ట్రీలో హిట్ అవ్వొచ్చు, కాకపోవచ్చు. ఆతర్వాత తన భవిషత్తు బాగుండాలి అందుకు చదువు ఉండాలి అందుకే చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వస్తుంది అని తెలిపారు.

View this post on Instagram

A post shared by Rasha (@rashathadani)

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..