ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన్న. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది.