AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రితేష్ దేశ్ ముఖ్‌ను ఆకట్టుకున్న తండ్రి ప్రేమ .. ఇది జుగాడ్ కా బాప్.. నెట్టింట ఫన్నీ వీడియో వైరల్

జుగాడ్‌కి సంబంధించిన వివిధ రకాల ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ రోజుల్లో, అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ నటుడు కూడా సోషల్ మీడియాలో న షేర్ చేశాడు. 'వైరల్ అవుతున్న వీడియోలో ఒక తండ్రి తన చిన్న కొడుకును పాల డబ్బాలో కూర్చోబెట్టి బైక్ మీద హ్యాపీగా వెళ్తున్నాడు. తండ్రి తనను అలా బైక్ మీద రోడ్డుమీద తీసుకెళ్తుంటే.. బాలుడు కూడా తన ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు.

Viral Video: రితేష్ దేశ్ ముఖ్‌ను ఆకట్టుకున్న తండ్రి ప్రేమ .. ఇది జుగాడ్ కా బాప్.. నెట్టింట ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Sep 18, 2023 | 1:07 PM

Share

మన దేశంలో జుగాడ్ కు కొదవలేదు. తనకు అవసరమైనప్పుడు.. ప్రతి భారతీయుడు తన పనిని ఆపకుండా జరుపుకోవడానికి అందుకు తగిన విధంగా ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటాడు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కోసం కొంత మంది ఇంట్లోనే జుగాడ్ కూలర్లు, ఏసీలు తరచుగా దర్శనం మిస్తూ ఉంటాయి.  కొందరు జుగాద్‌ని ఉపయోగించి ఒకే ఏసీని రెండు గదుల్లో అమర్చారు. అలాంటి జుగాడ్‌కి సంబంధించిన వివిధ రకాల ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ రోజుల్లో, అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ నటుడు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

‘వైరల్ అవుతున్న వీడియోలో ఒక తండ్రి తన చిన్న కొడుకును పాల డబ్బాలో కూర్చోబెట్టి బైక్ మీద హ్యాపీగా వెళ్తున్నాడు. తండ్రి తనను అలా బైక్ మీద రోడ్డుమీద తీసుకెళ్తుంటే.. బాలుడు కూడా తన ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. సంతోషంతో ఆ చిన్నారి ముఖం వెలిగిపోతుంది. ఈ ఫన్నీ వీడియోను బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. పాల వ్యాపారి బైక్‌కు పక్కగా పాల డబ్బా కట్టి, అదే కంటైనర్‌లో తన చిన్నబిడ్డను ఎక్కించుకుని సంతోషంగా రోడ్డుపై ఎలా బయలుదేరాడో వీడియోలో చూడవచ్చు. ఇలాంటి తమాషా దృశ్యాన్ని చాలా అరుదుగా చూసి ఉండవచ్చ అని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఫన్నీ వీడియో చూడండి

ఈ ఫన్నీ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, రితేష్ దేశ్‌ముఖ్ ‘జుగాడు బాప్’ అనే క్యాప్షన్‌లో రాశారు. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా..  25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ కామెంట్స్ చేశారు.

ఒక వినియోగదారు ‘వాట్ యాన్ ఐడియా’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘భారతదేశంలో ఏదైనా జరగవచ్చు’ అని రాశారు. అదే విధంగా, మరొక వినియోగదారు ఇలా రాశారు, ‘పిల్లవాడు ‘నా పరిస్థితులు నేనేమీ చేయలేను’ అని ఆలోచిస్తూ ఉండాలి”, మరొకరు ‘ఈ జుగాడ్ చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇందులో కూడా ప్రమాదం ఉందని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో