Viral News: ఒకేసారి ఏడుగురు యువతులను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. పెద్ద కుటుంబం కావాలి మరింత మందిని చేసుకుంటానని ప్రకటన

ఉగాండాలోని ముకోనో జిల్లాలోని బుగెరెకా గ్రామంలో సెప్టెంబర్ 10న ఈ వింత వివాహం జరిగింది. ఇందులో హజ్ హబీబ్ ఏడుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. తాను జీవితాతం తన భార్యలతో కలిసి జీవిస్తానని మరణం వరకూ వీడననని ప్రమాణం చేశాడు. ఇందులో అతని ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వైరల్ అయిన చిత్రాలలో, హజ్ హబీబ్ ఏడుగురు భార్యలు తమ తమ పేర్లతో ఉన్న కుర్చీలపై కూర్చున్నారు.

Viral News: ఒకేసారి ఏడుగురు యువతులను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. పెద్ద కుటుంబం కావాలి మరింత మందిని చేసుకుంటానని ప్రకటన
Uganda Man Marriage 7 Women
Follow us

|

Updated on: Sep 15, 2023 | 11:18 AM

ఒక వ్యక్తి ఏక కాలంలో ఒకరిని కాదు ఇద్దరినీ కాదు ఏకంగా ఏడుగురు యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఈ అపూర్వ వివాహం ఉగాండాలో జరిగింది. ఈ వివాహం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. హజ్ హబీబ్ ఎన్‌సికొన్నెన్ అనే వ్యక్తి ఒకే రోజు ఏడుగురు మహిళలను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు. ఇలా పెళ్లి చేసుకున్న భార్యల్లో ఇద్దరు అతనికి అక్కచెల్లెలు అని తెలి షాక్ తిన్నారు.  ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

thecitize.co.tz ప్రచురించిన నివేదిక ప్రకారం ఉగాండాలోని ముకోనో జిల్లాలోని బుగెరెకా గ్రామంలో సెప్టెంబర్ 10న ఈ వింత వివాహం జరిగింది. ఇందులో హజ్ హబీబ్ ఏడుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. తాను జీవితాతం తన భార్యలతో కలిసి జీవిస్తానని మరణం వరకూ వీడననని ప్రమాణం చేశాడు. ఇందులో అతని ఇద్దరు జీవసంబంధమైన సోదరీమణులు ఉన్నారు. వైరల్ అయిన చిత్రాలలో, హజ్ హబీబ్ ఏడుగురు భార్యలు తమ తమ పేర్లతో ఉన్న కుర్చీలపై కూర్చున్నారు.

హజ్ హబీబ్ భార్యలు

Uganda Man

Uganda Man

భార్యల్లో అసూయ పెరగరాదు

భర్తని నమ్మాలంటే భార్యల్లో అసూయ భావాలు పెరగకూడదని.. అందుకే అందరినీ ఒకే రోజు పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.  తనకు పెద్ద , సంతోషకరమైన కుటుంబం కావాలి’ అని చెప్పాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఏడు పెళ్లిళ్లు చేసుకున్నా తన మనసు సంతృప్తి చెందలేదని.. భవిష్యత్తులో మరింత మంది మహిళలను పెళ్లి చేసుకుని భార్యల సంఖ్య మరింత పెంచుకుంటానని చెప్పాడు. భార్యలను చేర్చుకుంటానని అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

కుటుంబం ఏం చెప్పిందంటే

వరుడి తండ్రి హజ్ అబ్దుల్ సమేకుల మాట్లాడుతూ తమ కుటుంబంలో బహుభార్యత్వం ఉందన్నారు. తన  తాతకి ఒకే ఇంట్లో ఆరుగురు భార్యలు ఉన్నారని.. తండ్రికి ఐదుగురు భార్యలని చెప్పారు. అంతేకాదు తన కూడా నలుగురు భార్యలు ఉన్నారని వారు ఒకే ఇంట్లో నివసిస్తున్నారని వరుడి తండ్రి హజ్ చెప్పారు.

వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ సంగీత కార్యక్రమం, దీనిని చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డు పక్కన ఉన్నారు. ఎందుకంటే ఉగాండాలో ఇంత భారీగా జరుగుతున్న మొదటి పెళ్లి. కాన్వాయ్‌లో వెళుతున్న దంపతులకు ప్రజలు చప్పట్ల మధ్య స్వాగతం పలికారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ