Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రీల్స్ .. లైక్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్ చేసిన యువకుడు.. ప్రాణాలతో చెలగాటం ఎందుకు అంటున్న నెటిజన్లు..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీకు మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఈ ఎత్తుపల్లాలున్న మట్టి రోడ్డుమీద ఒక కారు వస్తోంది. ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. కారు పైన ఒక కార్డ్ బోర్డు దానిమీద ఒక యువకుడు ఆనందంగా నిలబడి ఉన్న విషయం తెలుస్తుంది. ఇంతలో కుడి వైపు నుండి ఒక కారు అతి వేగంతో వచ్చి ఆ యువకుడు నిల్చున్న కార్డు బోర్డు ని ఢీకొట్టుకుంటూ వెళ్తుంది.

Viral Video: రీల్స్ .. లైక్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్ చేసిన యువకుడు.. ప్రాణాలతో చెలగాటం ఎందుకు అంటున్న నెటిజన్లు..
Stunt Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2023 | 3:05 PM

స్టంట్ వీడియోలు ప్రతిరోజూ ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ దీని క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. సినిమాల నుండి ప్రేరణ పొంది ఎక్కడైనా ఎప్పుడైనా సరే రకరకాల విన్యాసాలు చేయడానికి ఒక కారణమని అంటున్నారు. అయితే రీల్స్ పేరుతో ఈ స్టంట్ ను వయసుతో పని లేకుండా చేస్తూ వార్తల్లో నిలిచేవారు అధికంగానే ఉన్నారు. కానీ మంచి స్టంట్‌ని బాగా ప్రాక్టీస్ చేసి.. నైపుణ్యం కలిగిన  వ్యక్తి మాత్రమే చేయగలడు. అప్పుడే ఆ విన్యాసం ప్రజలను ఆకట్టుకుంటుంది. చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం నెట్టింట్లో అలాంటి ఒక స్టంట్ కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీకు మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఈ ఎత్తుపల్లాలున్న మట్టి రోడ్డుమీద ఒక కారు వస్తోంది. ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. కారు పైన ఒక కార్డ్ బోర్డు దానిమీద ఒక యువకుడు ఆనందంగా నిలబడి ఉన్న విషయం తెలుస్తుంది. ఇంతలో కుడి వైపు నుండి ఒక కారు అతి వేగంతో వచ్చి ఆ యువకుడు నిల్చున్న కార్డు బోర్డు ని ఢీకొట్టుకుంటూ వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఇలా కారు తాను నిల్చున్న కార్డు బోర్డు ని ఢీకొనడంతో దానిపై నిల్చున్న యువకుడు ఎగిరి దుమికి నేలపై పడిపోతాడు. ఈ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసేవే.. ఈ షాకింగ్ వీడియో  bednie.oligarhi అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా లైక్ చేసారు.. విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను చూసిన తర్వాత, ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ‘ఈ స్టంట్ వీడియో నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘ఈ స్టంట్ చిత్రం కోసం చిత్రీకరిస్తున్నట్లు తాను భావిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు ఇలాంటివి చేయడం డేంజర్ అంటూ ఎక్కువమంది వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..