AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భారీ వర్షానికి మ్యాన్‌హోల్‌ వద్ద నిలిచిపోయిన చెత్త .. స్వయంగా క్లీన్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు.. సర్వత్రా ప్రశంసల వర్షం..

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్త, చెదారం రోడ్డుమీద ఉన్న మ్యాన్‌హోల్‌ వద్ద చిక్కుకుపోవడంతో నీరు నిలిచిపోయింది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఆ చెత్తను క్లీన్‌ చేశారు. ఈ ఘటన టోలీచౌక్‌ ఫ్లై ఓవర్‌ వద్ద చోటు చేసుకుంది.

Hyderabad: భారీ వర్షానికి మ్యాన్‌హోల్‌ వద్ద నిలిచిపోయిన చెత్త .. స్వయంగా క్లీన్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు.. సర్వత్రా ప్రశంసల వర్షం..
Hyderabad Police
Surya Kala
|

Updated on: Sep 08, 2023 | 2:01 PM

Share

సమాజంలో శాంతి భద్రతలను సంరక్షిస్తూ, జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ,  నేరాలు, విధ్వంసాలు జరగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసులు. తన పర బేధాలు లేకుండా తమ విధులను నిర్వహిస్తారు పోలీసులు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రథమ శిక్షణ వంటి నైపుణ్యాలతో శిక్షణ పొందే పోలీసులు అవసరం అయితే ఏ పని చేయడానికైనా మేము సిద్ధమే అని అంటారు. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది తాజాగా భాగ్యనగరంలో జరిగిన ఓ సంఘటన.  గత కొన్ని మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్త, చెదారం రోడ్డుమీద ఉన్న మ్యాన్‌హోల్‌ వద్ద చిక్కుకుపోవడంతో నీరు నిలిచిపోయింది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఆ చెత్తను క్లీన్‌ చేశారు. ఈ ఘటన టోలీచౌక్‌ ఫ్లై ఓవర్‌ వద్ద చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను ట్రాఫిక్‌ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అదిచూసి ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

వీడియో వైరల్

ట్రాఫిక్‌ సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్‌ ఏసీపీ ధనలక్ష్మి, మరో పోలీసుతో కలిసి మ్యాన్‌హోల్‌ వద్ద నిలిచిపోయిన చెత్తను చేతులతో శుభ్రం చేశారు. మూసుకుపోయిన డ్రెయిన్‌ వల్ల ఆ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు నిలిచి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుండటంతో స్వయంగా ఏసీపీనే రంగంలోకి దిగి చెత్త క్లియర్‌ చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 3 లక్షలమంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేశారు. వందల్లో రీట్వీట్‌ చేస్తూ.. ప్రశంసల కామెంట్లు కురిపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..