Viral Video: ఇంట్లో నక్కిన నాగుపాముని ఒట్టి చేతులతో పట్టి బంధించిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్..

ఈ ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రా, నాగు పాము, కట్ల పాము, బ్లాక్ మాంబా వంటి పాములు కూడా ఉన్నాయి. కింగ్ కోబ్రా భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.. కానీ నాగుపాములు ప్రతిచోటా కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామాల్లో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు ఒక్కోసారి ప్రజల ఇళ్లలోకి కూడా చేరతాయి. తమ ఇంట్లో తాచు పాము కనిపిస్తే చాలు అప్పుడు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు గజాగజావణికిపోతారు.

Viral Video: ఇంట్లో నక్కిన నాగుపాముని ఒట్టి చేతులతో పట్టి బంధించిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్..
Snake Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2023 | 1:06 PM

ప్రపంచంలో కొన్ని వందల రకాల పాములున్నాయి. వాటిల్లో కొన్ని పాములు విషపూరితమైనవి. మరికొన్ని విషరహితమైనవి. అయితే పాములు తమ కంట పడకూడని మనుషులు ఎలా కోరుకుంటారో.. అదే విధంగా  ఎంత విషపూరితమైన పాములైనా తాము మనుషుల కంట పడకూడని కోరుకుంటాయనని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పాము కాటు వేస్తే వాటికి కూడా ప్రాణాపాయం ఉంటుంది. ఈ ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రా, నాగు పాము, కట్ల పాము, బ్లాక్ మాంబా వంటి పాములు కూడా ఉన్నాయి. కింగ్ కోబ్రా భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.. కానీ నాగుపాములు ప్రతిచోటా కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామాల్లో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు ఒక్కోసారి ప్రజల ఇళ్లలోకి కూడా చేరతాయి. తమ ఇంట్లో తాచు పాము కనిపిస్తే చాలు అప్పుడు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు గజాగజావణికిపోతారు. ఇది ఎవరి విషయంలోనైనా జరిగే విషయమే. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారికి  గూస్‌బంప్స్ వస్తున్నాయి.

అసలు సిసలైన ప్రమాదకరమైన నాగుపాము ఒక ఇంట్లోకి ప్రవేశించింది. దానికి బయటకు వెళ్లే దారి కనిపించక పోవడంతో ఒక చోట చిక్కుకుంది. అటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు పాము పట్టే వ్యక్తిని పిలిచారు. అతని పని పాములను పట్టుకోవడమే. ఎంత ప్రమాదకరమైన పామునైనా చాకచక్యంగా పట్టుకుంటాడు. విషపూరితమైన నాగుపామును పట్టుకుని గోనె సంచిలో పెట్టి బంధించాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Naveen snake (@snake_naveen)

ఆ వ్యక్తి గ్యాస్ సిలిండర్‌ను తొలగించిన వెంటనే నాగుపాము అటు ఇటు కదలడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఓ వ్యక్తి తన కర్ర సహాయంతో దానిని పట్టుకుని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ నాగు పాముని గోనె సంచిలో వేసుకుని అడవికి తీసుకెళ్లి వదిలేస్తానని చెప్పాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే.. ఇంత ప్రమాదకరమైన పామును పట్టుకునేటప్పుడు కాటేస్తే ఏమౌతుందోనన్న భయం అతడికి కలగలేదు. నాగుపాము కాటుకు గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందించాలని.. లేదంటే కొన్ని నిమిషాలు మాత్రమే జీవిస్తాడని చెప్పాడు.

కోబ్రా రెస్క్యూ  వీడియో పాము_నవీన్ అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే 1 లక్షా 57 వేల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకోగా..  10 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. రకాల కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..