Viral Video: వృద్ధురాలిని 2 నిమిషాల్లో స్పృహ కోల్పోయే వరకు 50 సార్లు బెత్తంతో కొట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్

వైరల్ అయిన క్లిప్‌లో వ్యక్తి  వృద్ధురాలిపై గొడుగుతో దాడి చేస్తున్నాడు. ఆ మహిళ తన కర్రతో తనను తాను ఆ దెబ్బల నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వ్యక్తి ఆ మహిళ కర్రను లాక్కొని దానితో ఆమెను కొట్టడం ప్రారంభించాడు. nypost నివేదిక ప్రకారం.. వ్యక్తి రెండు నిమిషాల వ్యవధిలో సుమారు 50 సార్లు వృద్ధ మహిళపై కర్రతో దాడి చేశాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకునే వరకు ఆమెను కొడుతూనే ఉన్నాడు. ఈ సమయంలో ఆ వ్యక్తిని ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు.

Viral Video: వృద్ధురాలిని 2 నిమిషాల్లో స్పృహ కోల్పోయే వరకు 50 సార్లు బెత్తంతో కొట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్
Man Attacks Elderly Woman
Follow us

|

Updated on: Sep 05, 2023 | 4:59 PM

నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోలు కొన్ని ఫన్నీగా ఉండి నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అయితే మరికొన్ని వీడియోలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తాయి.. అంతేకాదు అసలు వీళ్ళు మనుషులేనా ఇలాంటివారు కూడా ఉంటారా అనిపిస్తాయి. తాజాగా ఆందోళన కలిగించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ వ్యక్తి 60 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా కొట్టడం కనిపించింది. ఆ వృద్ధురాలు బాధతో విలపిస్తూ.. తనను కొట్టవద్దు అంటూ కనికరమించమని వేడుకున్నప్పటికీ కొడుతున్న వ్యక్తి హృదయం మాత్రం చలించ లేదని వైరల్ క్లిప్‌లో కనిపిస్తోంది. ఆ వృద్ధురాలు అపస్మారక స్థితికి చేరుకునే వరకు ఆమెపై బెత్తంతో దెబ్బల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

వైరల్ అయిన క్లిప్‌లో వ్యక్తి  వృద్ధురాలిపై గొడుగుతో దాడి చేస్తున్నాడు. ఆ మహిళ తన కర్రతో తనను తాను ఆ దెబ్బల నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వ్యక్తి ఆ మహిళ కర్రను లాక్కొని దానితో ఆమెను కొట్టడం ప్రారంభించాడు. nypost నివేదిక ప్రకారం.. వ్యక్తి రెండు నిమిషాల వ్యవధిలో సుమారు 50 సార్లు వృద్ధ మహిళపై కర్రతో దాడి చేశాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకునే వరకు ఆమెను కొడుతూనే ఉన్నాడు. ఈ సమయంలో ఆ వ్యక్తిని ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు.

ఇవి కూడా చదవండి

భీతిని గొల్పే వీడియో

స్పృహ తప్పి పడిపోయేంత వరకు ఆ మహిళను కొడుతూనే ఉన్నాడు

నివేదిక ప్రకారం ఈ షాకింగ్ సంఘటన హార్లెమ్ సబ్‌వే స్టేషన్‌లో జరిగింది. ఈ సంఘటన గత శుక్రవారం జరిగింది. అప్పుడు మహిళ పశ్చిమ 116వ వీధి వైపు వెళుతోంది. పోలీసులు వచ్చేలోపే గుర్తు తెలియని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గుర్తించిన పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అసలు దాడి చేసిన వ్యక్తికి, వృద్ధురాలికి మధ్య వాగ్వాదం ఎలా మొదలైందనేది ఇంకా తెలియలేదని..  ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

నిరంతర హింసాత్మక సంఘటనలు

రెండు నిమిషాల నాలుగు సెకన్ల ఈ క్లిప్‌ను రచయిత , కార్యకర్త జాసన్ కర్టిస్ ఆండర్సన్ Xలో షేర్ చేసారు. నిరాశ్రయులైన వృద్ధురాలిని ఎటువంటి కారణం లేకుండా దారుణంగా కొట్టాడు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూయార్క్ సబ్‌వేలో ఇటువంటి హింసాత్మక సంఘటనలు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. గత నెలలో ఓ వ్యక్తి..  రైలు ఆపరేటర్‌ను పైపుతో కొట్టాడు. అదే సమయంలో ఓ అపరిచితుడు మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడని గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ