AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మటన్ అంటే అంతేమరి.. బిర్యానీలో మటన్ పీస్ రాలేదని ఘర్షణకు దిగిన అతిథి.. ఇరువర్గాలు కర్రలతో కొట్లాట..

వైరల్ వీడియోలో ఏముందంటే.. ఓ పెళ్లి వేడుకలో బిర్యానీలో మటన్ ముక్కలు రాకపోవడంతో ఓ వ్యక్తి ఆగ్రహానికి గురై పెళ్లి వేడుకలో గొడవ చేశాడు. ఓ పెద్ద హాలు మధ్యలో తెల్లటి పరదా ఏర్పాటు చేశారు. ఆ పరదాకు ఒక వైపు మహిళలు కూర్చుని భోజనం చేస్తుంటే, మరోవైపు పురుషులు కూర్చున్నారు. హఠాత్తుగా కొంతమంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు.

Viral Video: మటన్ అంటే అంతేమరి.. బిర్యానీలో మటన్ పీస్ రాలేదని ఘర్షణకు దిగిన అతిథి.. ఇరువర్గాలు కర్రలతో కొట్లాట..
Wedding Viral Video
Surya Kala
|

Updated on: Sep 01, 2023 | 10:15 AM

Share

కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను చూస్తే ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి.. అంతేకాదు అసలు ఇలా కూడా జరుగుతాయా అనే ఆలోచనను కూడా కలిగిస్తాయి. పెళ్లిళ్లలో విందు, వినోదాల పాటు.. అనేక సార్లు చిన్న చిన్న విషయాలకు కూడా పంతాలకు వెళ్లి గొడవలు పడడం చూస్తూ ఉంటాం.. అయితే ఈ గొడవ చినుకు చినుకు గాలి వాన అయినట్లు.. ఒకొక్కసారి కర్రలు తీసుకుని ఒకరిపై ఒకరు కొట్టుకునే వరకూ .. కొన్ని సార్లు వధూవరులు అలిగి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయే పరిస్థితులకు దారి తీస్తుంది. ఇలా కర్రలు పట్టుకుని పెళ్లింట పరుగులు పెడుతున్న వీడియాలు కూడా నేడు సర్వసాధారణంగా మారిపోయాయి.  ప్రస్తుతం పాకిస్థాన్‌లో అలాంటి సంఘటన ఒకటి జరిగింది, దీని వీడియో నెటిజన్లను భయాందోళనలకు గురిచేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో గొడవ పడే విషయం చాలా చిన్నది. అయినా ఎందుకు గొడవ పడ్డారా అని ఆలోచిస్తే ఎవరైనా షాక్ అవుతారు.

వైరల్ వీడియోలో ఏముందంటే.. ఓ పెళ్లి వేడుకలో బిర్యానీలో మటన్ ముక్కలు రాకపోవడంతో ఓ వ్యక్తి ఆగ్రహానికి గురై పెళ్లి వేడుకలో గొడవ చేశాడు. ఓ పెద్ద హాలు మధ్యలో తెల్లటి పరదా ఏర్పాటు చేశారు. ఆ పరదాకు ఒక వైపు మహిళలు కూర్చుని భోజనం చేస్తుంటే, మరోవైపు పురుషులు కూర్చున్నారు. హఠాత్తుగా కొంతమంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. వీరి ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే.. ఇరువర్గాల ఆహుతులు కొట్టుకునే వరకూ అది కూడా దారుణంగా పోట్లాడుకోవడం వరకూ వెళ్ళింది. ఒకరినొకరు తన్నడం, కొట్టడం, లాఠీలతో కొట్టుకోవడం మొదలెట్టారు. ఈ గొడవ చాలా సేపు జరుగుతూనే ఉండడంతో కొంతమంది ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. కొంచెం సేపు తర్వాత వివాదం సద్దుమణిగింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

వీడియోను షేర్ చేసిన వినియోగదారుడు ఈ ఘటన పాకిస్తాన్‌కు చెందినదని.. అక్కడ వివాహ వేడుకలో ఒక ముఖ్య అతిథికి పెట్టిన బిర్యానీ మటన్ ముక్కలు లేవని అందుకే అతను కోపంతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో @gharkekalesh అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 6 నిమిషాల 37 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత… నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు ‘ఇప్పుడు ఈ వ్యక్తి రోజుకు సరిపడా ప్రొటీన్లు అందకపోతే ఏమి చేస్తాడు?’ అని హాస్యంగా రాశాడు, మరొక వినియోగదారు ‘ఇలాంటివి పాకిస్తాన్‌లో మాత్రమే జరుగుతాయి అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..