Viral Video: ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన యువతి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ ఖాయం..

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి ఎటువంటి భయం లేకుండా ఇంటి పైకప్పు లోపల దాగి ఉన్న రెండు పెద్ద పాములను బయటకు తీసింది. ఆమె ధైర్యాన్ని చూసిన ఎవరైనా సరే షాక్ తినాల్సిందే. ఎందుకంటే చిన్న పాము కనిపిస్తే చాలు.. అది ఎటువంటిది అని ఆలోచించకుండా అక్కడ నుంచి పారిపోవడానికి కాళ్లకు బుద్ధి చెబుతారు. అయితే ఇక్కడ యువతి మాత్రం అందుకు మినహాయింపు.

Viral Video: ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన యువతి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ ఖాయం..
Snake Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2023 | 11:38 AM

పొరపాటున కూడా పాముల కంట తాము పడకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే పాము కనిపిస్తే చాలు వీలైనంత దూరం పారిపోతారు. ప్రపంచంలో కొన్ని వందల రకాలు.. కొన్ని లక్షల సంఖ్యలో  ఉన్నాయి. అయితే పాముల్లో కొన్ని విషరహితమైనవి ఉంటె.. కొన్ని రకాల పాములు విషపూరితమైనవి ఉంటాయి. ఈ విషపూరితమైన పాములు కాటు వేస్తే ఏ జీవి అయినా సరే మరణించాల్సిందే.. అందుకనే కొన్ని రకాల పాములను చూస్తే మనుషులు మాత్రమే కాదు.. కొన్ని రకాల జీవులు కూడా దూరంగా పారిపోతాయి. అదే సమయంలో పాములంటే భయపడకుండా వాటిని పట్టుకుని ఆడించేవారు కొందరు ఉంటె.. ఆ పాములను పట్టుకుని సురక్షిత ప్రదేశంలో విడిచి పెట్టేవారు కొందరున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం..

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి ఎటువంటి భయం లేకుండా ఇంటి పైకప్పు లోపల దాగి ఉన్న రెండు పెద్ద పాములను బయటకు తీసింది. ఆమె ధైర్యాన్ని చూసిన ఎవరైనా సరే షాక్ తినాల్సిందే. ఎందుకంటే చిన్న పాము కనిపిస్తే చాలు.. అది ఎటువంటిది అని ఆలోచించకుండా అక్కడ నుంచి పారిపోవడానికి కాళ్లకు బుద్ధి చెబుతారు. అయితే ఇక్కడ యువతి మాత్రం అందుకు మినహాయింపు.

ఇవి కూడా చదవండి

ఇంట్లోని సీలింగ్ లో ఉన్న రెండు పెద్ద పాములను పట్టుకుంటుంది. ఆ మహిళ టేబుల్‌పైకి ఎక్కి కర్ర సహాయంతో పాములను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అప్పుడు పాములు పైకప్పు నుండి బయటకు రాగానే ఒక దాని తరువాత మరొకటి రెండు బయటకు వచ్చాయి. ఈ పాములు చాలా భారీగా ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఆ పాముల బరువుని ఆ యువతి మోయలేకపోయింది అని చెప్పవచ్చు.

వీడియో చూడండి

చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్న ఈ వీడియో @InsaneRealitys అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 45 సెకన్ల ఈ వీడియోను 7 లక్షల 96 వేల మందికి పైగా వీక్షించగా, 5 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత.. నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు  ‘ఆ యువతి చూడానికి రాక్షసిలా ఉన్న పాములను భయం లేకుండా భలే పట్టుకుంది అని కామెంట్ చేస్తే.. ఆ యువతి చిన్నప్పటి నుండి ఇలా చేస్తుందా? నేను షాక్ అయ్యాను..  అదే సమయంలో నన్ను చాలా ఆకట్టుకుంది అని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో హృదయాన్ని కదిలించే దృశ్యమని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?