Viral Video: పెళ్లి వేదికపై ఓ వైపు షూట్ చేస్తూనే మరోవైపు ఓ రేంజ్‌లో డాన్స్ .. అదరహో అంటున్న నెటిజన్లు.

వైరల్ అవుతున్న ఈ వీడియో పెళ్లి వేడుకలో ఉన్న డ్యాన్స్ స్టేజ్‌కి సంబంధించినది. అక్కడ ఉన్నవారు డ్యాన్స్ చేస్తుంటే.. దానిని షూట్ చేస్తున్న కెమెరా మెన్ కూడా పాటలో లీనమై డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ కెమెరా మెన్ డ్యాన్సర్ తో సమానంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అతని డ్యాన్స్ చేయడంలో ఎటువంటి ఆటంకం కలగలేదు. కుర్రాడి ఈ టాలెంట్ చూసి అందరూ మల్టీ టాస్కింగ్ అని అంటున్నారు.

Viral Video: పెళ్లి వేదికపై ఓ వైపు షూట్ చేస్తూనే మరోవైపు ఓ రేంజ్‌లో డాన్స్ .. అదరహో అంటున్న నెటిజన్లు.
Wedding Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 18, 2023 | 10:09 AM

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలకైతే కొదవే లేదు. పెళ్లి వేడుకల్లో, వేదిక మీద.. జయమాల, ఇలా రకరకాల సందర్భాల్లో చోటు చేసుకునే ఫన్నీ సన్నివేశాలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. వాస్తవానికి పెళ్లి కుదిరింది మొదలు.. సన్నాహాలు కొన్ని నెలల ముందుగానే ప్రారంభమవుతాయి. వివాహ వేదిక వద్దకు వధూవరులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఈ సమయంలో వధూవరులు మాత్రమే కాదు స్నేహితులు, బంధువులు పెళ్లి ఊరేగింపుని విపరీతంగా ఆనందిస్తారు. అంతేకాదు పెళ్లి రిసెప్షన్ సమయంలో చేసే డ్యాన్స్, సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే..  ఈ నేపధ్యములో తాజాగా ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివాహ వేదిక వద్ద ఫోటో గ్రాఫర్ పెళ్లి వేడుకను చిత్రీకరిస్తూనే మరోవైపు అక్కడ ఉన్న అతిధుల మధ్య అతిథిలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో పెళ్లి వేడుకలో ఉన్న డ్యాన్స్ స్టేజ్‌కి సంబంధించినది. అక్కడ ఉన్నవారు డ్యాన్స్ చేస్తుంటే.. దానిని షూట్ చేస్తున్న కెమెరా మెన్ కూడా పాటలో లీనమై డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ కెమెరా మెన్ డ్యాన్సర్ తో సమానంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అతని డ్యాన్స్ చేయడంలో ఎటువంటి ఆటంకం కలగలేదు. కుర్రాడి ఈ టాలెంట్ చూసి అందరూ మల్టీ టాస్కింగ్ అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక కెమెరామెన్ పెళ్లి వేడుకలో జరుగునో డ్యాన్స్ బారాత్ వేడుకను  చిత్రీకరిస్తున్నాడు. అక్కడ ఉన్నవారు డ్యాన్స్ చేయడం చూసి స్వయంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఓ వైపు కెమెరాలో డ్యాన్స్ ని చూస్తూనే మరోవైపు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లను కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో  డ్యాన్స్ చేశాడు. కెమెరా పట్టుకుని సంగీతానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్న తీరు నిజంగా అభినందనీయం.

@PunjabiTouch అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్ష మందికి పైగా చూశారు. ఆ యువకుడు సొంత డ్యాన్స్ అకాడమీని నడపాలని కామెంట్ చేయగా.. మరొకరు.. ఆ యువకుడు తన డ్యాన్స్ తో మనసు కొల్లగొట్టాడని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.