Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనిషి, సింహంల మధ్య స్నేహం.. పిల్లితో ఆడుకున్నట్లు ఆడుకుంటున్న వ్యక్తి.. వీడియో వైరల్..

ఈ వీడియోలో ఒక వ్యక్తి పెంపుడు కుక్క లేదా పిల్లిలాగా క్రూరమైన సింహంతో కూర్చొని కనిపించాడు. వారి స్నేహం సాటిలేనిది. ఇలాంటి దృశ్యాన్ని మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. వీడియోలో, వ్యక్తి నేలపై  పడుకున్నాడు. అతని ముందు ఒక పెద్ద సింహం కూడా కూర్చుని ఉంది.  సింహం తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి తలను నాకుతుంటే.. అతను ఆ సింహం జూలుని దువ్వుతున్నాడు.

Viral Video: మనిషి, సింహంల మధ్య స్నేహం.. పిల్లితో ఆడుకున్నట్లు ఆడుకుంటున్న వ్యక్తి.. వీడియో వైరల్..
Man And Lion Friendship
Follow us
Surya Kala

|

Updated on: Aug 11, 2023 | 11:39 AM

ప్రకృతిలో ఎన్నో వింతలు.. అందులో కొన్ని స్నేహాలు ఆకర్షిస్తాయి. అంతేకాదు సృష్టిలో ఏర్పడే వింతల్లో ఒకటి.. కొంతమంది మధ్య ఏర్పడే స్నేహం.. అడవిలో జంతువులకు, మనుషులకు మధ్య ఏర్పడే స్నేహాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అడవుల్లో అనేక రకాల జంతువులు నివసిస్తాయి. అయితే కొన్ని రకాల జంతువులు అడవిలో నివసించడానికి కూడా ఇష్టపడతాయి. కొన్ని రకాల జంతువులు పొరపాటున అయినా అడవి నుంచి బయటకు వస్తే మనుషులకే ప్రమాదం. అలాంటి కౄర జంతువులు సింహాలు, పులులు, చిరుత  వంటివి ఉన్నాయి. ఇవి కనిపించడం కాదు.. కనీసం గర్జన వింటేనే చాలు ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి. అయితే అటువంటి కౄర జంతువు బారిన మనుషులు పడితే.. అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించి చూడండి.. ఇటువంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.  కొన్ని రకాల భయంకరమైన జంతువులు మానవులపై దాడి చేసి చంపేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా అడవికి మృగరాజు ఒక మనిషితో స్నేహం చేస్తోంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి పెంపుడు కుక్క లేదా పిల్లిలాగా క్రూరమైన సింహంతో కూర్చొని కనిపించాడు. వారి స్నేహం సాటిలేనిది. ఇలాంటి దృశ్యాన్ని మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. వీడియోలో, వ్యక్తి నేలపై  పడుకున్నాడు. అతని ముందు ఒక పెద్ద సింహం కూడా కూర్చుని ఉంది.  సింహం తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి తలను నాకుతుంటే.. అతను ఆ సింహం జూలుని దువ్వుతున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ భారీ సింహం తనపై దాడి చేస్తే ఏమి జరుగుతుందో అని ఆ వ్యక్తి అసలు ఆలోచిస్తున్నట్లు అనిపించడం లేదు. ఇద్దరూ మంచి స్నేహితుల్లా సరదాగా గడుపుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం చూస్తుంటేఎవరికైనా అద్భుతం అనిపించక మానదు. ప్రమాదకరమైన సింహం, మనిషి మధ్య ఉన్న ప్రేమ నిజంగా అద్భుతమైనది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో

ఈ వీడియో వైల్డ్‌లైఫ్ 011 అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటి వరకు 38 వేల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు వందలాది మంది వీడియోను లైక్ చేసారు.. సింహం, వ్యక్తి స్నేహం చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. .

కొందరు ఒక వ్యక్తికి ‘ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతావు’ అని చెబుతుంటే, ‘మనుషులు, జంతువులు చాలా మంచి స్నేహితులు’ అని కొందరు అంటున్నారు. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియదు కానీ.. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆశ్చర్యపరిచింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..