Viral News: స్కూల్ నుంచి ఉద్యోగం తీసేస్తే .. యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి .. టీచింగ్ చేస్తూ నెలకు రూ. 10 కోట్లు సంపాదిస్తున్న యువతి

ప్రపంచం బ్రే థాంపోన్ టీచింగ్ ను ఎంతగానో ఇష్టపడింది. ఆమె వీడియోలను పిల్లలు, పెద్దలు ఇష్టపడడం ప్రారంభించారు. ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్ ప్రకారం బ్రె థాంపోన్ తన ఛానెల్‌లో చిన్న పిల్లలను ఎలా చూసుకోవాలి.. అనే గైడెన్స్ కూడా వీడియోల ద్వారా ఇస్తుంది. ఉద్యోగం పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చినా .. తన పరిస్థితి మరింతగా దిగజారకముందే యూ ట్యూబ్ ఛానెల్ ఐడియా వచ్చిందని చెబుతోంది.  

Viral News: స్కూల్ నుంచి ఉద్యోగం తీసేస్తే .. యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి .. టీచింగ్ చేస్తూ నెలకు రూ. 10 కోట్లు సంపాదిస్తున్న యువతి
Bre ThompsonImage Credit source: Instagram/brethompsonxo
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2023 | 11:45 AM

మారుతున్న కాలంతో పాటు ప్రతీదీ మారిపోతోంది. అందులో వృత్తి వ్యాపార రంగాల్లో కూడా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. సమాజంలో గౌరవాన్ని ఇచ్చే వృత్తిలో ఒకటి ఉపాధ్యాయు వృత్తి..అయితే టీచింగ్ సంపాదన మాత్రం ఇవ్వదని.. బతకలేక బడిపంతులు అని ఒకప్పుడూ వ్యాఖ్యానించేవారు కూడా.. అయితే మారుతున్న కాలంతో పాటు టీచింగ్ వృత్తిలో కూడా పెను మార్పులు సంభవించాయి. ఇప్పుడు ఒక మహిళా టీచర్.. వృత్తిలో చాలా నిపుణురాలిగా మారింది.. ఒక మహిళా టీచర్ ప్రతి నెలా 10 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తూ ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

బ్రే థాంపోన్ అనే యువతి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. చిన్న పిల్లలకు చదువు చెబుతుంది. అంతేకాదు ఈ యువతి సైడ్ వర్క్ కూడా చేస్తుంది. అందుకే ఆమె తన ఉద్యోగం కోల్పోయింది. అప్పుడు బ్రే థాంపోన్ భిన్నమార్గంలో ఆలోచించడం మొదలు పెట్టింది.. సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా టీచింగ్ చెబుతుంది.. అంతేకాదు మరో 11 మార్గాల్లో సంపాదిస్తుంది.

ఛానెల్ లో మాత్రమే కాదు వివిధ రకాలుగా డబ్బు..

ప్రపంచం బ్రే థాంపోన్ టీచింగ్ ను ఎంతగానో ఇష్టపడింది. ఆమె వీడియోలను పిల్లలు, పెద్దలు ఇష్టపడడం ప్రారంభించారు. ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్ ప్రకారం బ్రె థాంపోన్ తన ఛానెల్‌లో చిన్న పిల్లలను ఎలా చూసుకోవాలి.. అనే గైడెన్స్ కూడా వీడియోల ద్వారా ఇస్తుంది. ఉద్యోగం పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చినా .. తన పరిస్థితి మరింతగా దిగజారకముందే యూ ట్యూబ్ ఛానెల్ ఐడియా వచ్చిందని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మీడియాతో మాట్లాడుతూ.. తాను టీచింగ్ తో పాటు మరో 11 మార్గాల్లో సంపాదిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు తాను ఇంటర్నేషనల్ టీచర్స్ సైట్‌లో చేరానని.. ఇప్పుడు అక్కడ టీచింగ్ ఐటమ్స్ అమ్ముతున్నాను అని చెప్పింది. అంతేకాదు తన యూట్యూబ్ ఛానెల్‌ గురించి అక్కడ ప్రచారం చేస్తున్నాను. తనకు వచ్చిన డబ్బులను స్టాక్ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెడుతుంది. అలా తన సంపాదనను మరింత అధికం చేసుకుంది. ఇలా డిఫరెంట్ వేస్ లో సంపాదిస్తున్న మొత్తం చుస్తే.. ప్రతి నెలా దాదాపు మన దేశ కరెన్సీలో  10 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..