Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కైడైవ్ చేస్తూ థ్రిల్లింగ్ వెడ్డింగ్.. ఈ పెళ్ళికి అతిథులుగా వెళ్లంటే దైర్యం ఉండాల్సిందే.. షాకింగ్ వీడియో వైరల్

వాస్తవానికి వివాహ వేడుక ఇరు కుటుంబాలను.. ఇద్దరు మనుషులను కలిపే వేడుక.. అందమైన వాతావరణంతో జరిగే వేడుక. అయితే వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూస్తున్నది సాహసోపేతమైన,  సృజనాత్మకమైన వివాహమే.పెళ్లికి వచ్చిన అతిథులు ఎత్తైన కొండపై నిలబడి ఉన్నారు. వధూవరులు ఇద్దరు అతిథులతో అక్కడి నుంచి స్కైడైవ్ చేశారు. 

Viral Video: స్కైడైవ్ చేస్తూ థ్రిల్లింగ్ వెడ్డింగ్.. ఈ పెళ్ళికి అతిథులుగా వెళ్లంటే దైర్యం ఉండాల్సిందే.. షాకింగ్ వీడియో వైరల్
Wedding Couple
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2023 | 1:08 PM

నేటి యువ తరంలో సమాజం, కుటుంబం కంటే మనసు చెప్పే దే పాటించే నేచర్ ఎక్కువగా ఉంది. తమ భిన్నమైన అభిరుచులతో  జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుకునే ఓపిక ఉంది. ఈ కారణంగానే యువత రకరకాల అడ్వెంచర్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో యువతీయువకులు రకరకాల విన్యాసాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఒక జంట తమ పెళ్లిని భిన్నంగా చేసుకోవాలని భావించారు. ఎత్తైన పర్వతం నుండి స్కైడైవింగ్ చేస్తూ ఈ జంట తమ వివాహాన్ని చిరస్మరణీయమైన, ప్రత్యేకమైన రీతిలో జరుపుకున్నారు.

వాస్తవానికి వివాహ వేడుక ఇరు కుటుంబాలను.. ఇద్దరు మనుషులను కలిపే వేడుక.. అందమైన వాతావరణంతో జరిగే వేడుక. అయితే వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూస్తున్నది సాహసోపేతమైన,  సృజనాత్మకమైన వివాహమే.పెళ్లికి వచ్చిన అతిథులు ఎత్తైన కొండపై నిలబడి ఉన్నారు. వధూవరులు ఇద్దరు అతిథులతో అక్కడి నుంచి స్కైడైవ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నూతన జంట పేరు ప్రిసిల్లా యాంట్,  ఫిలిప్పో లెకర్స్. వీరి వివాహానికి సంబంధించిన వీడియో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు రాకరకాలుగా స్పందిస్తున్నారు. జంట  ధైర్యానికి, సాహసానికి నిజంగా సలాం. అతిథులకు కూడా ఇది మరపురాని వేడుక అవుతుందని అంటున్నారు.

వైరల్ వీడియో 

నేను దీన్ని నిజంగా ప్రేమిస్తున్నాను. నా పెళ్లి కూడా ఇలాగే చేసుకోవాలని ఉంది కానీ ఏం చేయాలి మీ అంత ధైర్యం నాకు లేదు. కొత్త జంటకు అభినందనలు, మీ జీవితం సాహసంతో నిండి ఉంటుంది అని మరొకరు చెప్పారు. ఈ వీడియో చూసి భయపడ్డాను అని మరొకరు అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..