Bhima Bull: కోట్ల విలువజేసే గేదె.. జీడిపప్పు, బాదం, నెయ్యి దీని ఆహారం.. విదేశాల్లో సైతం సైమన్‌కు భారీ డిమాండ్..

భారతీయ జాతికి చెందిన ఈ భీమ్ బుల్ ముర్రా జాతికి చెందినది గేదె. ఈ గేదె బరువు 1500 కిలోలు. అలాగే ఇది 6 అడుగుల ఎత్తు, 14న్నర అడుగుల పొడవు ఉంటుంది. ఈ గేదెను చూసేందుకు జనం పోటెత్తారు. అంతే కాదు ఈ భీమ్ బుల్ ఇప్పటి వరకు 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచింది.

Bhima Bull: కోట్ల విలువజేసే గేదె.. జీడిపప్పు, బాదం, నెయ్యి దీని ఆహారం.. విదేశాల్లో సైతం సైమన్‌కు భారీ డిమాండ్..
Jodhpur Bhima Bull
Follow us
Surya Kala

|

Updated on: Jul 28, 2023 | 1:06 PM

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఒక గేదె ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఇది మామూలు గేదె కాదు. ఈ గేదెను కొనుగోలు చేసేందుకు రూ.24 కోట్ల వరకు తాము ఇవ్వడానికి రెడీ అంటున్నా ఆ గేదెకు చెందిన యజమాని అమ్మడానికి నో అంటున్నాడు. మరి కొన్ని కోట్లు ఖరీదు చేస్తున్న గేదె ప్రత్యేకత ఏమిటో తెలుసా..! జోధ్‌పూర్‌కి సుదూర ప్రాంతాల నుంచి ఈ ముర్ర జాతికి చెందిన గేదెను చూడడానికి ఎగబడతారు కూడా..

భారతీయ జాతికి చెందిన ఈ భీమ్ బుల్ ముర్రా జాతికి చెందినది గేదె. ఈ గేదె బరువు 1500 కిలోలు. అలాగే ఇది 6 అడుగుల ఎత్తు, 14న్నర అడుగుల పొడవు ఉంటుంది. ఈ గేదెను చూసేందుకు జనం పోటెత్తారు. అంతే కాదు ఈ భీమ్ బుల్ ఇప్పటి వరకు 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ కారణంగా ఇప్పటి వరకు రూ.24 కోట్ల వరకు బిడ్లు వచ్చాయని గేదె యజమాని చెబుతున్నారు. అయితే ఈ గేదెను తాను అమ్మడం ఇష్టం లేదని చెబుతున్నారు.

రూ. 5000 వరకు రోజువారీ ఖర్చులు ఈ గేదె ఎత్తు ఎంత ఉందో.. అదే విధంగా దీని ఆహారం కూడా అంతే. ఈ భీమ్ బుల్ ఒక రోజులో 1 కిలోల నెయ్యి, అర కిలో వెన్న తింటుంది. అంతేకాదు డ్రై ఫ్రూట్స్  కూడా రోజువారీ తినే ఆహారంలో తప్పని సరి.  ప్రతి రోజూ జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్ , ఇతర డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇవ్వబడుతుంది. ఈ గేదె తినే ఆహారం, తాగే పానీయాలతో సహా దీని నిర్వహణ ఖర్చు రోజుకు సుమారు రూ. 5000 అవుతుందట. అంతేకాదు గేదె ఉండే ప్రాంతంలో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేస్తాడు.

ఇవి కూడా చదవండి

జోధ్‌పూర్‌లోని భోపాల్‌గఢ్‌కు చెందిన జవహర్‌లాల్ జంగీద్ ఈ గేదె యజమాని. గేదె వయసు 9 ఏళ్లు అని చెప్పారు. ఈ గేదెను చాలాసార్లు వేలం వేసినా కోట్లు పలికినా అమ్మడం మాత్రం ఇష్టపడడు.

ఈ జాతి గేదెల ధర ఎందుకు ఎక్కువ? ముర్రా జాతి గేదెల ధరలు ఎందుకు ఎక్కువ అంటే.. పశువుల పెంపకందారులు ఈ జాతి గేదెల వీర్యం విక్రయం ద్వారా లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారని పశువైద్యాధికారి డా.తాన్ సింగ్ తెలిపారు. దీని ఒక్క చుక్క సైమన్ ధర రూ.2400 వరకు ఉంటుంది. విదేశాల్లో దీని ధర ఎక్కువ. వీర్యం మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయబడుతుంది.

ముర్రా జాతి గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయని పశువైద్యాధికారి డాక్టర్ తాన్ సింగ్ చెబుతున్నారు. వీటి పాలు చిక్కగా ఉంటాయి. అంతేకాదు పాలలో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక గేదె పిల్ల ధర లక్షకు పైగా ఉంటుంది. ముర్రా జాతి గేదె రోజుకు 27 లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇస్తుందని డాక్టర్ చెప్పారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..