Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏంది బ్రో ఇది.. స్టార్ ఆల్ రౌండర్‌కే సుస్సు పోయించావుగా.. వీడియో చూస్తే పరేషానే..

Ashes Series: ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుగాంచాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మన్లను కూడా తన పదునైన బౌలింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులో ఉన్నంతసేపు చుక్కలు చూడాల్సిందే. అయితే, తాజాగా స్టార్క్ తన మాయాజాలాన్ని మరోసారి చూపించాడు.

Video: ఏంది బ్రో ఇది.. స్టార్ ఆల్ రౌండర్‌కే సుస్సు పోయించావుగా.. వీడియో చూస్తే పరేషానే..
Mitchell Starc ball shockBen Stokes
Follow us
Venkata Chari

|

Updated on: Jul 28, 2023 | 1:07 PM

ENG vs AUS: ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుగాంచాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మన్లను కూడా తన పదునైన బౌలింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులో ఉన్నంతసేపు చుక్కలు చూడాల్సిందే. అయితే, తాజాగా స్టార్క్ తన మాయాజాలాన్ని మరోసారి చూపించాడు. అది కూడా డేజంరస్ ఆల్ రౌండర్‌గా పేరొందిన బెన్ స్టోక్స్‌కి రుచి చూపించాడు. ఓవల్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ తొలిరోజైన గురువారం స్టార్క్‌ కళ్లు చెదిరే బంతికి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కంగుతిన్నాడు.

స్టార్క్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయనివ్వలేదు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

నాలుగు పడేసిన స్టార్క్..

ఇంగ్లండ్‌ జట్టు మంచి స్థితిలో లేదు. మంచి భాగస్వామ్యం కోసం ఆరాటపడుతోంది. స్టోక్స్‌కు తోడుగా హ్యారీ బ్రూక్ అడుగులు వేశాడు. బ్రూక్స్‌తో కలిసి స్టోక్స్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతాడని ఇంగ్లండ్ ఆశించింది. స్టార్క్ వారి ఆశలను వమ్ము చేశాడు. 39వ ఓవర్ తెచ్చిన స్టార్క్.. ఆఫ్; మిడిల్ స్టంప్ మధ్య బంతిని విసిరాడు. బంతి గాలిలో ఉన్నప్పుడు, అది లోపలికి వస్తుందని అనిపించింది. స్టోక్స్ కూడా అలాగే ఆలోచించి ఈ బంతిని ఆన్ సైడ్ ఆడేందుకు వెళ్లాడు.

అక్కడితో ఆట ముగిసిపోలే. ఆ తర్వాత స్టోక్స్ వంతుకు చేరింది. బ్యాట్‌కు అతి సమీపంలోకి వెళ్లిన బంతి కొద్దిగా బయటకు వచ్చింది. అది ఆఫ్ స్టంప్‌పైకి వెళ్లి వికెట్లను పడగొట్టింది. ఆ తర్వాత స్టోక్స్ ముఖం మాడిపోయింది. కోపంతో రగిలిపోయింది. ఆ బంతిని రిప్లేలో చూసి ఆశ్చర్యపోయాడు. స్టోక్స్‌ మాత్రమే కాదు.. ఈ బంతిని చూసినవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

మొదటి రోజు ఇలా..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు బేస్ బాల్ క్రికెట్ కు అతుక్కుపోయి అదే స్టైల్ లో ఆటను కొనసాగించింది. ఆతిథ్య జట్టు తరచూ విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలీ (21), బెన్ డకెట్ (41), మోయిన్ అలీ (34) శుభారంభాలను పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయారు. ఐదు పరుగులు చేసిన తర్వాత జో రూట్ ఔటయ్యాడు. అయితే బ్రూక్ ఒక ఎండ్‌లో ఉండి నిరంతరం పరుగులు చేస్తున్నాడు. 91 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో క్రిస్ వోక్స్ 36, మార్క్ వుడ్ 28 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ స్కోరు 250 దాటింది.

స్టార్క్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ చెరో రెండు వికెట్లు తీశారు. కమిన్స్, మిచెల్ మార్ష్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ (24) రూపంలో ఒక వికెట్ కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా 26, మార్నస్ లబుషెన్ స్టంప్స్ వరకు రెండు పరుగులతో ఆడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..