Strawberry Moon: పౌర్ణమి రాత్రి ఆకాశాన్ని మెరిపించిన అద్భుతం..! ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాబెర్రీ మూన్‌ చిత్రం

ఇది పురాతన సంప్రదాయానికి సంబంధించినదని చెబుతారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఈ రోజున చంద్రుడు ఇతర రోజుల కంటే 14 శాతం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. నెటిజన్లు చంద్రుడి అందమైన ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తున్నారు..

Strawberry Moon: పౌర్ణమి రాత్రి ఆకాశాన్ని మెరిపించిన అద్భుతం..! ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాబెర్రీ మూన్‌ చిత్రం
Strawberry Moon
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 12:43 PM

జూన్ నెల మొదటి పౌర్ణమి ఆకాశంలో అందమైన, ఆకర్షణీయమైన దృశ్యం కనువిందు చేసింది. పౌర్ణమి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆకాశంలో స్ట్రాబెర్రీలా మెరుస్తున్న చంద్రుని ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. చాలా మంది ఈ క్షణాన్ని తమ మనస్సులో బంధించారు. వత్పూర్ణిమ నాడు ఈ ప్రత్యేక యోగం వచ్చింది. ప్రస్తుతం పౌర్ణమినాటి చంద్రుని ఆ అద్భుత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేకమైన ‘స్ట్రాబెర్రీ మూన్‘ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూసి ఆనందించారు. ఇది రాత్రి ఆకాశంలో పింక్ కలర్ చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపించింది. దీనినే ‘స్ట్రాబెర్రీ మూన్’ని ‘రోజ్ మూన్’ అని కూడా అంటారు. నెటిజన్లు చంద్రుడి అందమైన ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తున్నారు..

‘స్ట్రాబెర్రీ మూన్’ అంటే పింక్ చంద్రుడు కాదు. అమెరికాలోని గిరిజన తెగలు జూన్ నెలలో వచ్చే పౌర్ణమికి ‘స్ట్రాబెర్రీ మూన్’ అని పేరు పెట్టారు. అమెరికాలో స్ట్రాబెర్రీల పంట కాలం ప్రారంభంలో వచ్చే పౌర్ణిమ కావడంతో అక్కడ పురాతన కాలంలో వారు ఈ పౌర్ణిమకు స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టుకున్నారు. ఈ పౌర్ణిమ కు ప్రపంచంలో వేర్వేరు పేర్లున్నాయి. ఐరోపాలో దీనిని రోజ్ మూన్ అని పిలుస్తారు, ఇది గులాబీల పెంపకాన్ని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

‘సూపర్‌మూన్’ రహస్యం ఏమిటి?..

చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో అత్యంత దగ్గరగా, దూరంగా ఉన్నప్పుడు అప్సిస్ అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తన కక్ష్యలో దగ్గరగా వస్తే, అది పరిమాణంలో పెద్దదిగా కనిపిస్తుంది. మరోవైపు, చంద్రుడు భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో దూరంగా వెళితే, అది పరిమాణంలో చిన్నదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న రోజున, అది పరిమాణంలో పెద్దదిగా కనిపిస్తుంది. దీనిని సూపర్ మూన్, లేదా స్ట్రాబెర్రీ మూన్ అని కూడా అంటారు.

అనేక ఇతర కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. యూరప్‌లో దీన్ని ‘రోజ్‌ మూన్‌’ అంటారు. దీనితో పాటు ‘స్ట్రాబెర్రీ మూన్’ని ‘హనీ మూన్’, ‘హాట్ మూన్’ అని కూడా పిలుస్తారు. స్ట్రాబెర్రీ చంద్రుని ఆకర్షణీయమైన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రజలు షేర్‌ చేస్తున్నారు. మరో నివేదిక ప్రకారం, జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రంగుతో ‘స్ట్రాబెర్రీ మూన్’కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పురాతన సంప్రదాయానికి సంబంధించినదని చెబుతారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఈ రోజున చంద్రుడు ఇతర రోజుల కంటే 14 శాతం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ కారణంగా దీనిని ‘రోజ్ మూన్’ లేదా ‘హాట్ మూన్’ అని పిలుస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?