Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Bill: ఎండాకాలం ఏసీలతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా.. ఈ సూపర్‌ చిట్కాలు పాటిస్తే చాలు..

ఇంకా కొందరికీ ఏసీ లేకుండా ఉండటం అసాధ్యంగా మారింది.. ఇలాంటి టైమ్‌లో చాలా మంది ఈ వేసవిలో ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇల్లు, ఆఫీసు ఇలా ఎక్కడికి వెళ్లినా ఏసీ లేనిదే ఉండలేక పోతున్నారు.. అయితే, ఏసీల వాడకం వల్ల పెరుగుతున్న విద్యుత్ బిల్లులను తగ్గించడానికి, ఏసీల సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించాలి .

Electricity Bill: ఎండాకాలం ఏసీలతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా.. ఈ సూపర్‌ చిట్కాలు పాటిస్తే చాలు..
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 10:21 AM

స్ప్లిట్, విండో ACలు రెండింటినీ ప్రజలు ఎక్కువగానే ఉపయోగిస్తుంటారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి ఏసీ కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం, భారతదేశం అంతటా వేడి చాలా తీవ్రత ఎక్కువగా మారింది. ఎండ, వేడిగాలుల భయంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా కొందరికీ ఏసీ లేకుండా ఉండటం అసాధ్యంగా మారింది.. ఇలాంటి టైమ్‌లో చాలా మంది ఈ వేసవిలో ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇల్లు, ఆఫీసు ఇలా ఎక్కడికి వెళ్లినా ఏసీ లేనిదే ఉండలేక పోతున్నారు.. అయితే, ఏసీల వాడకం వల్ల పెరుగుతున్న విద్యుత్ బిల్లులను తగ్గించడానికి, ఏసీల సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించాలి .

ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదలకు, శక్తి ఆదా 6 శాతం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు మీ AC ఉష్ణోగ్రతను ఎంత తక్కువగా ఉంచుకుంటే, దాని కంప్రెసర్ ఎక్కువసేపు పని చేస్తుంది. దీంతో మీ కరెంటు బిల్లు పెరుగుతుంది. కాబట్టి డిఫాల్ట్ ఉష్ణోగ్రత వద్ద ఏసీని ఆన్‌లో ఉంచడం వల్ల 24 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. మీకు కావాలంటే, మీకు నచ్చినంత తక్కువగా ఉష్ణోగ్రత ఉంచుకోవచ్చు.

మీరు మీ AC ఉష్ణోగ్రతను 18 డిగ్రీల, 23-24 డిగ్రీల మధ్య ఉంచాలి. ఇది మీ విద్యుత్ వినియోగాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఎయిర్ కండీషనర్ ఆపరేట్ చేసేటప్పుడు , గది తలుపులు, కిటికీలు మూసివేయాలి.. దీంతో గది త్వరగా చల్లబడుతుంది. ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించడం ఆ కాసేపు ఆపేయండి.. ఎందుకంటే ఈ పరికరాలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి.

ఇవి కూడా చదవండి

విద్యుత్‌ ఆదా చేయడానికి మరొక మార్గం మీ గది ఉష్ణోగ్రత మీకు సౌకర్యవంతంగా మారినపుడు రాత్రిపూట AC ని ఆఫ్ చేయండి. ముఖ్యంగా రోజంతా నడిస్తే రాత్రి పూట ఏసీ అవసరం ఉండదు. మీరు AC గదిలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టయితే, ఈ ట్రిక్ పాటించండి.

AC నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌లను ఆన్‌లో ఉంచండి. సీలింగ్ ఫ్యాన్ నడుస్తున్నప్పుడు, చల్లని గాలి గది అన్ని మూలలకు ప్రసరిస్తుంది. దీని కారణంగా మీరు AC ఉష్ణోగ్రతను తగ్గించాల్సిన అవసరం ఉండదు. తక్కువ శక్తిని ఉపయోగించినప్పటికీ గది త్వరగా చల్లబడుతుంది. ఇలా తక్కువ సమయం పాటు ఏసీని నడపడం వల్ల కరెంటు బిల్లు తగ్గుతుంది.

ఏసీలో మురికి పేరుకుపోవడంతో ఇల్లు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫిల్టర్‌ను క్లీన్ చేయడం, కొత్త ఫిల్టర్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా AC శక్తి వినియోగాన్ని దాదాపు 15 శాతం తగ్గించవచ్చు. దీంతో కరెంటు బిల్లు తగ్గుతుంది.

కొత్త ఏసీని కొనుగోలు చేయాలనుకుంటే, ఇంట్లో నివసించే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకోండి. ఇంట్లో ఎక్కువ మంది ఉండే గది ఎక్కువ వేడిగా ఉంటుంది. అప్పుడు ఏసీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. స్ప్లిట్, విండో ఏసీలు రెండూ ఉపయోగపడతాయి. విండో ACలు తక్కువ ఫీచర్లతో ఉన్నప్పటికీ చౌకగా ఉంటాయి, మరోవైపు స్ప్లిట్ ACలు ఖరీదైనవి. అయితే, స్లీప్ మోడ్, టర్బో కూలింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ..