Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు విద్య అందిస్తాం: సెహ్వాగ్

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని ప్రశంసిస్తూ సెహ్వాగ్‌ ట్విట్‌ చేశారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించారు. 1000 మంది వరకు గాయపడ్డారు. ఇది భారతదేశంలోని అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా చేరింది.

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు విద్య అందిస్తాం: సెహ్వాగ్
Virendar Sehwag
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 9:56 AM

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు. ఒడిశా ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని ప్రశంసిస్తూ సెహ్వాగ్‌ ట్విట్‌ చేశారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించారు. 1000 మంది వరకు గాయపడ్డారు. ఇది భారతదేశంలోని అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా చేరింది. ఈ విషాద సంఘటన ఏళ్ల తరబడి పాటు మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల భవిష్యత్తును కాపాడటమే నేను చేయగలిగింది. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఆ పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు గానూ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. అదే సమయంలో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై విచారణకు నిపుణుల కమిషన్‌ను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిషన్‌ను నియమించాలని పిటిషన్‌లో కోరారు. న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించారు. కానీ, అంచనా ప్రకారం మృతుల సంఖ్య 275 అని ప్రదీప్ జెనా పేర్కొన్నాడు. సంఘటన స్థలంలో, ఆసుపత్రిలో కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినందున మృతుల సంఖ్య 288గా వచ్చిందన్నారు. కానీ, ఇప్పుడు, జిల్లా కలెక్టర్ వివరణాత్మక తనిఖీ, నివేదిక తర్వాత జెనా మాట్లాడుతూ, ప్రమాదంలో 275 మంది మరణించినట్టుగా చెప్పారు.

275 మందిలో 78 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. మరో 10 మృతదేహాలను గుర్తించే ప్రక్రియ పూర్తయిందని జెనా తెలిపారు. ఇప్పటి వరకు 170 మృతదేహాలను బాలాసోర్ నుంచి భువనేశ్వర్‌కు తరలించారు. మరో 17 మందిని ఇక్కడికి తరలించనున్నారు. మృత దేహాలను కచ్చితంగా గుర్తించడమే ఇప్పుడు అధికారులకు సవాల్‌గా మారింది.. వ్యక్తులను గుర్తించడానికి DNA నమూనాలను పరిశీలించనున్నారు. మరణించిన వారి ఫోటోలు మూడు వెబ్‌సైట్‌లలో www.osdma.org , www.srcodisha.nic.in, www.bmc.gov.in లలో అప్‌లోడ్ చేస్తారని జెనా చెప్పారు.

మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి సమీప బంధువులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి కూడా రూ.లక్ష సాయం అందజేస్తారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు.

మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో ప్రకటించారు. దీంతో ఒడిశా ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..