Odisha Train Accident: ఒడిశా ప్రమాద బాధితులకు అండగా నిలిచే దయగల నాయకుడు మోదీ- ధర్మేంద్ర ప్రధాన్
ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 288 మంది మృతి చెందారు. సుమారు 800 వరకు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక..
ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 288 మంది మృతి చెందారు. సుమారు 800 వరకు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ బాలాసోర్‌కు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
A compassionate leader who stands with the people through thick and thin.
Accompanied PM @narendramodi ji to the Balasore district hospital where he met and inquired about the well-being of injured passengers. PM Modi’s presence, words of empathy and rock solid support will… pic.twitter.com/TLVMLZIwHK
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 3, 2023
అక్కడి నుంచి బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన ప్రయాణికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ధైర్యాన్ని ఇచ్చారు. ప్రధాని మోడీ క్షతగాత్రులను పరామర్శిస్తున్న దృశ్యాలతో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. ఒడిశా ప్రమాద బాధితులకు అండగా నిలిచే దయగల నాయకుడు నరేంద్ర మోదీ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..