వెంటాడిన మృత్యువు..! ఒడిశా రైలు ప్రమాద క్షతగాత్రులను తరలిస్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి తీవ్రగాయాలు

ఒడిశాలోని బాలాసోర్ నుండి గాయపడిన ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు జూన్ 3, శనివారం బెంగాల్‌లోని మేదినీపూర్‌లో ప్రమాదానికి గురైంది . జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను బస్సులో వారి వారి స్వగ్రామాలకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.

వెంటాడిన మృత్యువు..! ఒడిశా రైలు ప్రమాద క్షతగాత్రులను తరలిస్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి తీవ్రగాయాలు
Odisha Train Tragedy
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2023 | 8:43 PM

జూన్ 2, శుక్రవారం మూడు రైళ్లు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 288 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలో ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మృతిచెందిన వారిపట్ల సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు భరోసాను ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు బాలాసోర్‌ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్‌లో శనివారం ప్రమాదానికి గురైంది. పికప్‌ వాహానాన్ని ఆ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బస్సు ప్రమాదంలో మళ్లీ గాయపడిన వారిని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి గాయాలతో తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. బస్సు ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్