Odisha Train Accident: రైలు ప్రమాదం తర్వాత బాలాసోర్‌లోని ఆసుపత్రులకు క్యూ కట్టిన యువత.. ఎందుకో తెలుసా..?

క్షతగాత్రులకు అధునాతన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదన్నారు. వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.. ఒడిశా రైలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు.. నిజానిజాలు తెలుసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదం తర్వాత బాలాసోర్‌లోని ఆసుపత్రులకు క్యూ కట్టిన యువత.. ఎందుకో తెలుసా..?
Balasore Hospitals
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2023 | 8:06 PM

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని పగనాగ బజార్ ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదంలో గాయపడి కటక్‌ ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రమాదంలో ఇంత మంది మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. ప్రమాదంలో మరణించిన వారి బంధువులను ఓదార్చారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అధునాతన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదన్నారు. వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.. ఒడిశా రైలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు.. నిజానిజాలు తెలుసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.

మరోవైపు, ప్రమాదం జరిగిన ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను సరిచేసే పనిలో రైల్వే శాఖ నిమగ్నమైంది. రైలు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఎప్పటికీ వదిలిపెట్టదని రైల్వే శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు.. సహాయక చర్యల్లో సహకరించిన స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే పలువురు స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి క్యూ కట్టారు. భారీ క్యూలైన్లలో నిలబడి బాధితులకు రక్తదానం చేశారు. పలువురు యువకులు స్వచ్ఛంగా ఆస్పత్రి వద్దకు చేరుకుని రక్తదానం చేశారు. రాత్రి 10గంటల నుండి ఉదయం వరకు క్యూ లో ఉండి రక్తదానం చేశారు. వీరంతా ఏ పిలుపు లేకుండా స్వచ్ఛందంగా వచ్చి గంటల తరబడి ఉండి రక్తదానం చేసి ఇళ్లకు వెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతుండగా, స్థానికుల మానవత్వాన్ని అభినందిస్తున్నారు నెటిజన్లు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రమాద బాధితులను సజీవంగా రక్షించేందుకు వారు రెస్క్యూ టీమ్‌తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

రక్తదానం చేసిన వారిలో పోలీసులు, అధికారులు, స్థానిక ప్రజలు కూడా ఉన్నారు. అనేక ఇతర ఆసుపత్రులలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు 2,000 మందికి పైగా ప్రజలు బాలాసోర్ మెడికల్ కాలేజీ, ఇతర ఆసుపత్రులకు చేరుకున్నారని, చాలా మంది రక్తదానం చేశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రి మార్చురీలో శవాలు గుట్టలుగా నిండిపోయాయి. వాటిలో చాలా వరకు ఇంకా గుర్తించలేదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే