Varun Gandhi: జీతంలో కొంతభాగాన్ని రైలు బాధిత కుటుంబాలకు ఇవ్వండి.. ఎంపీలను కోరిన బీజేపీ నేత వరుణ్ గాంధీ

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తోటీ ఎంపీలకు ఓ పిలుపునిచ్చారు. రైలు ప్రమాద బాదిత కుటంబాలకు తమ జీతంలోని కొంత భాగాన్ని అందజేయాలని కోరారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు.

Varun Gandhi: జీతంలో కొంతభాగాన్ని రైలు బాధిత కుటుంబాలకు ఇవ్వండి.. ఎంపీలను కోరిన బీజేపీ నేత వరుణ్ గాంధీ
Bjp Mp Varun Gandhi
Follow us
Aravind B

|

Updated on: Jun 03, 2023 | 7:55 PM

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తోటీ ఎంపీలకు ఓ పిలుపునిచ్చారు. రైలు ప్రమాద బాదిత కుటంబాలకు తమ జీతంలోని కొంత భాగాన్ని అందజేయాలని కోరారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకరమని.. మన జీతంలో కొంత భాగాన్ని వారికి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవాలని నా తోటి ఎంపీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు. వాళ్లకి ముందు మద్దతు ఇవ్వాలని ఆపై న్యాయం జరగాలని కోరారు.

ఇదిలా ఉండగా ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి