Virat Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై కోహ్లి దిగ్బ్రాంతి.. వారంతా తొందరగా కోలుకోవాలంటూ..
Virat Kohli: ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న కోహ్లీ మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో..
Virat Kohli: ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న కోహ్లీ మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో జరిగే WTC Final కోసం లండన్‌లో ఉన్న కోహ్లీ ఈ మేరకు శనివారం ఉదయం ట్వీట్ చేశాడు. కోహ్లీ తన ట్వీట్‌లో ‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఇంకా గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
ఇవి కూడా చదవండి— Virat Kohli (@imVkohli) June 3, 2023
ఇదిలా ఉండగా.. ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు చెబుతున్నారు. మరో 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై దేశంలోని పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, సినీవ్యాపార ప్రముఖులు స్పందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..