AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికులు.. కుటుంబ సభ్యుల ఆందోళన.. రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం..

Odisha Train Accident: ఒడిశా బాలేశ్వర్‌ సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి లెక్కల ప్రకారం 238 మంది దుర్మరణం చెందారు. షాలిమార్‌ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురవగా..

Odisha Train Accident: రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికులు.. కుటుంబ సభ్యుల ఆందోళన.. రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం..
Ap People In Odisha Train Accident
శివలీల గోపి తుల్వా
| Edited By: |

Updated on: Jun 03, 2023 | 11:01 AM

Share

Odisha Train Accident: ఒడిశా బాలేశ్వర్‌ సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి లెక్కల ప్రకారం 238 మంది దుర్మరణం చెందారు. షాలిమార్‌ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురవగా.. ఈ రెండింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్ర ప్రయాణికుల ఆరా తీస్తోంది. బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీలోకి పలు స్టేషన్లలో మొత్తం 52 మంది  రిజర్వేషన్  ప్రయాణికులు ఎక్కారు. వారిలో తిరుపతి స్టేషన్ నుంచి 18 మంది, చీరాల నుంచి 12 మంది, గూడూరు నుంచి 2, నెల్లూరులో 2, ఒంగోలులో 2, రాజమండ్రి 2, బాపట్ల 2, బెజవాడ 4, రేణిగుంట స్టేషన్‌లో 8 మంది చొప్పున ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కినట్లు అధికారులు వెల్లడించారు.

ఇంకా ఈ ప్రమాదంలో ఉన్న మరో ట్రైన్ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో కూడా పెద్ద సంఖ్యలోనే ప్రయాణికులు ఏపీకి వస్తున్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితా ద్వారా తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమార్‌, సంత్రగచ్చి, ఖరగ్‌పూర్‌, బాలేశ్వర్‌ స్టేషన్ల నుంచి ఎక్కిన ప్రయాణికుల్లో విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరుకు ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకు దిగాల్సి ఉంది. ఇదే రైలులో రాజమహేంద్రవరం స్టేషన్‌ నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కి.. చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు వెళ్లేలా రిజర్వేషన్లు చేసుకున్నారని రైల్వే అధికారులు వెల్లడించారు.

కాగా, ప్రమాదానికి రైళ్లలో ప్రయాణిస్తున్న తమ వారు ప్రాణాలతో ఉన్నారో లేదోనని.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు, ఏపీ సీఎం జగన్ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకముందు సీఎం జగన్.. రైలు ప్రమాదానికి గురైన ట్రైన్స్‌లోని ప్రయాణికుల వివరాలపై ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాద్‌ని రంగంలోకి దించారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే రైల్వే శాఖ నుంచి మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు, తక్కువ గాయాలైన వారికి 50 వేల రూపాయలను ప్రకటించింది రైల్వే శాఖ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..