- Telugu News Photo Gallery Paragliding Sites: Best Places in India to Go high with Exhilarating Flying Experiences
Paragliding Sites: పారాగ్లైడింగ్ కోసం దేశంలోని అత్యుత్తమ ప్రదేశాలు.. అడ్వేంచర్‌తో పాటు ప్రకృతి అందాలను చూడాలంటే వెళ్లాల్సిందే..
Paragliding Sites: చాలా మందికి అండ్వెంచర్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఇక సాహసంతో కూడుకున్నవాటిలో పారాగ్లైడింగ్ కూడా ఒకటి. ఒక వేళ మీరు కూడా అడ్వెంచరస్ పారాగ్లైడింగ్ చేయాలనుకుంటున్నారా..? అయితే పారాగ్లైడింగ్ కోసం ఉత్తమమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. మీరు అక్కడకు వెళ్లి పారాగ్లైడింగ్‌ని ఆస్వాదించవచ్చు.
Updated on: Jun 02, 2023 | 10:14 AM

కొంతమందికి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. అటువంటివాటిలో పారాగ్లైడింగ్ కూడా ఒకటి. అయితే ఈ పారాగ్లైడింగ్‌ని ఎక్కడ పడితే అక్కడ చేస్తే మజా ఉండదు. ఆ నేపథ్యంలో మన దేశంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆయా ప్రదేశాల్లో మీరు పారాగ్లైడింగ్‌ని ఎంతగానో ఆస్వాదించవచ్చు. మరి ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు చూద్దాం..

రాణిఖేత్: మీరు పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోకి రాణిఖెత్‌కి వెళ్లవచ్చు. పారాగ్లైడింగ్ సమయంలో మీరు ఇక్కడ పచ్చని దృశ్యాలు, జలపాతం అందాలను ఆస్వాదించగలరు. నిజంగా మీకు పారాగ్లైడింగ్ అంటే ఇష్టం ఉన్నట్లయితే, మీరు ఒకసారి అయినా ఈ ప్రదేశాన్ని సందర్శించాలి.

సోలాంగ్ వ్యాలీ: మీరు హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాంగ్ వ్యాలీలో కూడా పారాగ్లైడింగ్‌ని అమితంగా ఆస్వాదించవచ్చు. మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశం మీకు ఇంకా బాగా నచ్చుతుంది. లోయలు, పర్వత శిఖరాల అందాలు మీ మనస్సును ఆకర్షిస్తాయి.

బిర్ బిల్లింగ్: పారాగ్లైడింగ్ కోసం దేశంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్న బిర్ బిల్లింగ్ కూడా ఒకటి. ఇక్కడ మీరు ఆకాశం నుంచి నేల వరకు ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాన్ని పొందగలుగుతారు. ఇవేకాక మీరు ఇక్కడ బంగీ జంపింగ్, ట్రెక్కింగ్ వంటివి కూడా చేయవచ్చు.

నంది హిల్స్: కర్ణాటకలోని నంది హిల్స్ పారాగ్లైడింగ్‌కు చాలా మంచి ప్రదేశం. మీరు ప్రకృతి అందాలను చూడాలనుకుంటే తప్పక ఈ ప్రదేశాన్ని సందర్శించాలి. ఈ అనుభవం ఒత్తిడి బస్టర్‌గా కూడా పనిచేస్తుంది.





























