Odisha Train Accident: అసలేం జరిగింది.. ఇదిగో ట్రాఫిక్‌ ఛార్ట్‌… కామన్‌ లూప్‌లోకి రావడంతోనే

ఒడిశా రైలు ప్రమాదంపై ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. కానీ... ఎన్నో అంతుచిక్కని ప్రశ్నల వెంటాడుతున్నాయి. అసలు... గూడ్స్‌ రైలు ఉన్న ట్రాక్‌పైకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఎలా అనుమతించారనే ప్రశ్న తలెత్తుతోంది.

Odisha Train Accident: అసలేం జరిగింది.. ఇదిగో ట్రాఫిక్‌ ఛార్ట్‌... కామన్‌ లూప్‌లోకి రావడంతోనే
Rail Traffic Chart
Follow us

|

Updated on: Jun 03, 2023 | 9:02 PM

ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మంది మృతి చెందగా.. 900 మందికి పైగా  గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. రైలు ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు అసలేం జరిగింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ రైల్వే ట్రాఫిక్‌ అధికారులు ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ లే అవుట్‌ను రిలీజ్ చేశారు. రైలు ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ చార్ట్ వాడతారు. ఏ ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగిందో గుర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది.

ఇందులో 3 రైల్వే లైన్లు పక్కపక్కనే ఉన్నాయి. అందులో మధ్యలైన్‌ ‘అప్‌ మెయిన్‌’. ఇందులోనే షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ట్రైన్ ప్రయాణించింది. దానికి రైట్ సైడ్ ఉన్న లైన్‌ ‘ డౌన్‌ మెయిన్‌’ ‌లో  బెంగళూరు నుంచి హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లింది. అయితే, అప్‌మెయిన్‌ లైన్‌లో వెళ్తున్న కోరమాండల్‌ అక్కడ క్రాసింగ్‌ పాయింట్‌ ఉండటంతో బై మిస్టేక్ కామన్‌ లూప్‌లోకి వచ్చేసింది. దీంతో ఆ సమయానికే అక్కడ హాల్ట్ అయిన ఉన్న గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఆ తాకిడికి కోరమాండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ‘డౌన్‌ మెయిన్‌ లైన్‌’‌లోకి ఎగిరిపడ్డాయి. ఆపై నిమిషాల వ్యవధిలో  అటుగా క్రాస్‌ అవుతున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీ కొట్టడంతో డ్యామేజ్ మరింత పెరిగింది.

మెయిన్‌లైన్‌లో వేగంగా వెళ్లే.. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు  ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లను లూప్‌లైన్‌లోకి మళ్లిస్తారు. అవి వెళ్లిపోయిన తర్వాత, సిగ్నల్‌ క్లియరెన్స్‌ను బట్టి మళ్లీ వాటిని మెయిన్‌లైన్‌లోకి వచ్చేందుకు అనుమతి ఇస్తారు. సిగ్నల్స్‌ సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం