- Telugu News Photo Gallery Pm modi reached balasore train accident spot latest update met with injured Telugu News
Odisha Train Accident: దోషులను విడిచిపెట్టను.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
Updated on: Jun 03, 2023 | 6:37 PM

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ప్రధాని మొదట బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 1,000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి ఇది.

ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీ సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రదాని మాట్లాడారు. గాయపడిన వారికి సాధ్యమైన అన్ని సదుపాయాలు, సహాయం చేయాలని సూచించారు.

సంఘటనా స్థలంలో కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో ప్రధాని మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని ప్రధాన మంత్రి వారిని కోరారు. ఈ విషాదం భయానకతను తగ్గించడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు.

మృతుల కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు మెయిన్ లైన్‌కు బదులుగా అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పై చెల్లాచెదురుగా ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొనడంతో బోల్తా పడ్డాయి.





























