AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indigo Flights: విమానం టేకాఫ్‌ అయిన 20 నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్‌..! ప్రయాణికుల్లో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..

ఇండిగో విమానంలో మరోమారు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానా టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.  ఈ విమానంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి కూడా ప్రయాణిస్తున్నారు.

Indigo Flights: విమానం టేకాఫ్‌ అయిన 20 నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్‌..!  ప్రయాణికుల్లో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..
Indigo
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2023 | 7:35 AM

Share

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం అస్సాంలోని గౌహతి నుండి దిబ్రూగఢ్‌కు జూన్ 4న ఉదయం బయలుదేరింది. కానీ 20 నిమిషాల తర్వాత కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని మళ్లీ గౌహతికి తీసుకెళ్లారు. ప్రముఖ గోపీనాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం ఉదయం 8.40 గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత వెంటనే 20 నిమిషాల తర్వాత విమానాన్ని మళ్లీ గౌహతి వైపు మళ్లించారు. అయితే, విమానం ఇంజిన్ లో సాంకేతిక స‌మ‌స్య రావ‌డంతో కేంద్ర‌మంత్రి రామేశ్వ‌ర్ తెలి విమానాన్ని అస్సాంలోని గువాహ‌టి విమానాశ్ర‌యంలో సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు. కాగా కేంద్ర‌మంత్రి మాట్లాడుతూ..తాను.. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్‌, తెరస్‌ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరామ‌ని. దులియాజన్‌, టింగ్‌ఖాంగ్‌, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లోనే గువహాటి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేం సురక్షితంగా ఉన్నాం అని తెలిపారు. తాను ఇంకా విమానాశ్రయం లోనే ఉన్నానని, ఆ విమానం నడవదని అధికారులు చెప్పారని రామేశ్వర్ తెలి చెప్పారు.

మరోవైపు దిబ్రూగఢ్‌ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా దిగిందని గువాహాటి ఎయిర్‌పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 150 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. తనిఖీల కోసం విమానాన్ని పంపినట్లు చెప్పాయి.

ఇవి కూడా చదవండి

ఈ విమానంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీతో పాటు దిబ్రూగఢ్ ఎమ్మెల్యే ప్రశాంత్ ఫుకాన్, దునియాజన్ ఎమ్మెల్యే తెరేష్ గ్వాలా కూడా ఉన్నారు. వారితో పాటు పలువురు ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇండిగో ఫ్లైట్ 6E2652 కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 20 నిమిషాల్లో గౌహతిలోని ప్రముఖ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి