AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత

మెట్రోలో మహిళ ఫొటోలు తీసినట్లు ఆరోపణలు రావడంతో CISF సిబ్బంది, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎయిమ్స్ మెట్రో స్టేషన్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిబ్బందిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. సర్వీస్ పిస్టల్ చూపించారన్న ప్రయాణికుల ఆరోపణలను మెట్రో పోలీసులు ఖండించారు.

Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత
Delhi Metro Incident, Cisf
SN Pasha
|

Updated on: Aug 17, 2026 | 4:05 PM

Share

ఢిల్లీ మెట్రోలో అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తన అనుమతి లేకుండా ఫొటోలు తీశాడని ఓ మహిళ ఆరోపించడంతో.. మెట్రో కోచ్‌లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై CISF శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.

ఆదివారం తెల్లవారుజామున సుమారు 12.40 గంటల సమయంలో ఎయిమ్స్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. మెట్రో కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తన ఫొటోలు CISF అధికారి తీస్తున్నారని ఆరోపించింది. దీంతో ఆమె సదరు సిబ్బందిని ప్రశ్నించింది. అయితే తాను ఆమె ఫొటోలు తీయలేదని సిబ్బంది ఖండించినట్లు తెలుస్తోంది. వాగ్వాదం జరుగుతున్న సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్‌ను ప్రయాణికులు పరిశీలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఫోన్ గ్యాలరీలో మహిళకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని కొందరు ప్రయాణికులు ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ ఫొటోలను తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియోలో కొందరు ప్రయాణికులు ఫొటోలు డిలీట్ చేయాలని CISF సిబ్బందిని పదేపదే కోరుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి.. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఘర్షణ సమయంలో CISF అధికారి తన సర్వీస్ పిస్టల్‌ను బయటకు తీసి ప్రయాణికుల వైపు గురిపెట్టారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఆరోపణ ఘటనను మరింత తీవ్రంగా మార్చింది. అయితే మెట్రో పోలీసు వర్గాలు మాత్రం ఆయుధంతో కూడిన అలాంటి ఘటన ఏదీ జరగలేదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అసలు ఏం జరిగిందన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సస్పెన్షన్.. విచారణ

ఘటనపై CISF అధికారులు చర్యలు ప్రారంభించారు. సంబంధిత అధికారిని సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు CISF వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు, PCR కాల్ అందడంతో మెట్రో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఫొటోలు తీసినట్లు ఆరోపించిన మహిళ నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

Follow Us
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..